Vishwanath & Sons Collections : రెండు రోజుల్లోనే సెంచరీ కొట్టిన సూర్య.. విశ్వనాథ్ & సన్స్ కలెక్షన్స్..
సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (Vishwanath & Sons Collections)
- Saketh U
- Published on- August 16, 2026 / 01:53 PM IST
Vishwanath & Sons Collections
Vishwanath & Sons Collections : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ ఇటీవల ఆగస్టు 14న రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
చాన్నాళ్ల తర్వాత సూర్య ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో రావడం, మమిత తన కామెడీ టైమింగ్ తో నవ్వించడం, మదర్ ఎమోషన్ తో ఏడిపించడంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. విశ్వనాథ్ & సన్స్ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అమెరికాలో ఆల్మోస్ట్ 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.
Also See : Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..
దీంతో సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్ & సన్స్ సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సూర్య కరప్పు, విశ్వనాథ్ & సన్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు.
