Ramani Kalyanam : ‘రమణి కళ్యాణం’ ట్రైలర్ చూశారా..? నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..

మీరు కూడా రమణి కళ్యాణం ట్రైలర్ చూసేయండి.. (Ramani Kalyanam)

  • Published on- May 20, 2026 / 02:53 PM IST

Ramani Kalyanam

Ramani Kalyanam : సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా రమణి కళ్యాణం. ఈ సినిమా మే 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

‘కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది..’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. సంజన RJ & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో వీల్ చైర్ లో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ మాటలు రాయడం గమనార్హం.

Also Read : NTR Birdies : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ పోస్ట్.. ఇద్దరు ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తూ.. క్యూట్ ఫొటో..

మీరు కూడా రమణి కళ్యాణం ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా కమెడియన్ ఆలీ గెస్ట్ గా హాజరయ్యారు. రమణీ కళ్యాణం ఒక మంచి ఫీల్‌గుడ్ సినిమాలా కనిపిస్తోంది.