SV Sekhar : మోదీకి సపోర్ట్ చేస్తున్నందుకు నాతో నటించను అని చెప్పాడు సిద్దార్థ్.. తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు..

తమిళ సీనియర్ నటుడు, ప్రస్తుత బీజేపీ(BJP) నేత SV శేఖర్ తాజాగా ఓ ఈవెంట్ లో సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

SV Sekhar sensational comments on Siddharth he refuse to act with Modi Supporters

SV Sekhar : ఒకప్పుడు వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందించిన సిద్ధార్థ్(Siddharth)కి గత కొంతకాలంగా సరైన హిట్ పడట్లేదు. ప్రస్తుతం తమిళ్, హిందీలో పలు సినిమాలు చేస్తున్నాడు సిద్ధార్థ్. తాజాగా హీరో సిద్దార్థ్ పై ఓ సీనియర్ తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళ సీనియర్ నటుడు, ప్రస్తుత బీజేపీ(BJP) నేత SV శేఖర్ తాజాగా ఓ ఈవెంట్ లో సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ.. ఇటీవల నిర్మాత శశికాంత్ నా దగ్గరికి వచ్చి టెస్ట్(Test) అనే సినిమాలో సిద్దార్థ్ పాత్రకు తండ్రిగా చేయాలి అంటే నేను ఓకే చెప్పాను. కానీ కొన్ని రోజుల తర్వాత వచ్చి మీరు మోదీ(Modi)కి మద్దతు ఇస్తున్నందుకు మోదీ వ్యతిరేకి అయిన సిద్దార్థ్ మీతో నటించను అని చెప్పాడు. చిత్ర కథ కొద్దిగా మార్చాము. మిమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్పినట్లు తెలిపారు.

Pushpa 2 : ‘పుష్ప 2’.. స‌రికొత్త రికార్డు.. ఆనందంలో బ‌న్నీ అభిమానులు.. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో మొద‌టి..

అలాగే.. వృత్తి వేరు, రాజకీయం వేరు. ఎంతోమంది వేరువేరు పార్టీల్లో ఉన్నా కలిసి నటించారు. సిద్దార్థ్ కి ఇంకా పరిపక్వత రాలేదు. నాతో కలిసి నటించడానికి భయపడుతున్నాడేమో. ఈ విషయంపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను అని తెలిపారు. దీంతో సిద్దార్థ్ పై సోషల్ మీడియాలో బీజేపీ, మోదీ మద్దతుదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్టార్ హీరోలే వేరే పార్టీల్లో ఉన్నా రాజకీయం వేరు, సినిమా వేరు అని నటిస్తున్నారు. అలాంటిది నువ్వు ఇలా చేస్తే అసలు సినిమాలే చెయ్యలేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సిద్దార్థ్ స్పందిస్తాడేమో చూడాలి

ట్రెండింగ్ వార్తలు