Mr Pregnant : ప్రెగ్నెంట్ అయిన బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్.. డెలివరీ ఆగస్ట్ 18..బేబీ 90 పర్సెంట్ లోడింగ్
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Syed Sohel) వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా సోహైల్ నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్(Mr Pregnant).
- Thota Vamshi Kumar
- Updated on- July 13, 2023 / 05:00 PM IST
MR Pregnant Release date
MR Pregnant Release date : బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Syed Sohel) వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా సోహైల్ నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్(Mr Pregnant). నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్(Roopa Koduvayur). మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సోహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపిస్తున్నాడు. బేబీ 90 పర్సెంట్ లోడింగ్, డ్యూడేట్ ఆగస్టు 18 అంటూ పోస్టర్ ఉన్న క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
హీరో ప్రెగ్నెంట్ కావడం అనేది తెలుగులో ఇదొక కొత్త తరహా ప్రమోగంగా చెప్పవచ్చు. సినిమా ఔట్పుట్ విషయంలో చిత్ర బృందం సంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 18న విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైవిథ్యమైన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో తమ సినిమా కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందన్న గట్టి నమ్మకంతో ఉంది చిత్రబృందం.
