Mr Pregnant : బిగ్‌బాస్ తరువాత ఒకే చేసిన ఫస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్.. కానీ దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా.. సోహైల్!
బిగ్‌బాస్ షో నుంచి బయటకి వచ్చిన తరువాత సోహైల్ విన్న మొదటి కథ మిస్టర్ ప్రెగ్నెంట్. కానీ ఈ మూవీ చేయడం వల్ల చాలా డిప్రెషన్‌లోకి..
- gum 95921
- Published On : August 17, 2023 / 02:13 PM IST
Syed Sohel said he went deep depression after accepting Mr Pregnant movie
Mr Pregnant : బిగ్ బాస్ స్టార్ సయ్యద్ సోహైల్ (Syed Sohel) ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. రూపా కొడవాయుర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రేపు ఆగష్టు 18న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది. ఇక కొన్ని రోజులు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ని జరుపుతున్న మూవీ టీం.. తాజాగా మీడియాతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మూవీ ప్రొడక్షన్ సమయంలో ఎదురైనా సమస్యలు గురించి సోహైల్ చెప్పుకొచ్చాడు.
Tollywood : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా సినిమా ఫెస్టివల్.. లవ్, మాస్, హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్..
బిగ్‌బాస్ షో నుంచి బయటకి వచ్చిన తరువాత సోహైల్ విన్న మొదటి కథ మిస్టర్ ప్రెగ్నెంట్. మూవీ లైన్ బాగా నచ్చడంతో సోహైల్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడు. అయితే ప్రొడక్షన్ విషయంలో మాత్రం ఈ మూవీ చాలా లేట్ అయ్యింది. ఈ చిత్రం తరువాత మొదలుపెట్టిన సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియన్స్ ముందుకు వచ్చేశాయి. దాదాపు రెండేళ్ల పాటు మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రీకరణ దశలోనే ఉండిపోయింది. దీంతో సోహైల్ చాలా డిప్రెషన్‌కి గురయ్యాడట.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమాని అత్యుత్సాహం.. బిడ్డని తీసుకోవాలంటూ..
సినిమా రిలీజ్ కి రావడం లేదని చిత్ర నిర్మాతని సోహైల్ గట్టిగా తిట్టాడు అంటా. సోహైల్ చేసిన గొడవకి ఇంకో ప్రొడ్యూసర్ అయితే తన మీద కేసు పెట్టేవాడిని, కానీ చిత్ర నిర్మాతలు చాలా సహనంతో మూవీ పూర్తి చేసి నేడు రిలీజ్ కి సిద్ధం చేశారని, అందుకు ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ అంటూ సోహైల్ వ్యాఖ్యానించాడు. కాగా ఈ సినిమాని తాజాగా 200 మంది ప్రెగ్నెంట్ మహిళలకు ప్రీమియర్ వేసి చూపించారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సోహైల్ మదర్ సినిమా చూసి.. నీ కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ అని సోహైల్ కి చెప్పి కన్నీరు పెట్టుకున్నారట.
