SlumDog : స్లమ్‌డాగ్ నుంచి గౌరీ హెగ్డే స్పెషల్ గ్లింప్స్.. అదిరిపోయింది..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ (SlumDog ).
- Thota Vamshi Kumar
- Updated on- August 10, 2026 / 11:31 AM IST
TABU as GAURI HEGDE Glimpse from SlumDog 33 Temple Road
SlumDog : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, దునియా విజయ్, టబు లు కీలక పాత్రను పోషిస్తున్నారు. లేటెస్టుగా టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో టబు.. గౌరీ హెగ్డే పాత్రలో కనిపించనుంది. ఎవరి మాట వినకుండా, తనకు నచ్చినది చేసుకుంటే వెళ్లే ఆఫీసర్‌గా కనిపిస్తోంది. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది.
Sahithi Dasari : సముద్ర తీరంలో పొలిమేర భామ.. సాహితి దాసరి స్టన్నింగ్ ఫోటోలు..
ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ బాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
