Tamannaah-Baahubali: బాహుబలి ఒక ఫెయిల్యూర్ ప్లాన్.. నష్టాలు భారీగా వచ్చేవి.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

బాహుబలి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా(Tamannaah Bhatia).

Tamannaah bhatia Shocking Comments on Baahubali

  • బాహుబలి పై తమన్నా షాకింగ్ కామెంట్స్
  • బాహుబలి బడ్జెట్ అత్యంత ప్రమాదకరం.
  • రాజమౌళి వల్లే అంత భారీ విజయం

Tamannaah Bhatia: సౌత్ ఇండియాలో స్టార్ బ్యూటీ తమన్నా భాటియా, ప్రస్తుతం తన రూట్‌ను పూర్తిగా నార్త్ ఇండియా వైపు మార్చేశారు. టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ పాత్రలతో మెప్పించాల్సిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ఎక్కువగా ఐటెం సాంగ్స్, స్పెషల్ నంబర్లకే పరిమితం కావడం ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గత ఏడాది తెలుగులో ఆమె నటించిన ‘ఓదెల 2’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడక డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లపైనే ఫోకస్ పెడుతున్నారు.

*Prashanth Neel: ‘డ్రాగన్’ మూవీ హీరో అనిల్ కపూర్.. ఆయనే విలన్.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌కు ప్రశాంత్ నీల్ చెక్

ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మైల్‌స్టోన్ మూవీ ‘బాహుబలి’ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ప్రస్తుత పరిస్థితుల నుండి వెనక్కి తిరిగి చూస్తే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ట్రేడ్ లెక్కలు చాలా భిన్నంగా ఉండేవి. అప్పట్లో ఒక ప్రాంతీయ సినిమా కోసం ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టడం సాధారణ విషయం కాదు. వ్యాపార కోణంలో చూస్తే.. అది ఫ్లాప్‌కు దారితీసే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయంలా అనిపించింది” అంటూ తమన్నా నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి తన విజన్‌ను నమ్మి, ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించడం వల్లే ‘బాహుబలి’ అంతటి ఘనవిజయం సాధించిందని, లేదంటే భారీ నష్టాలు వచ్చేవి అని ఆమె పేర్కొన్నారు. దీంతో తమన్నా(Tamannaah Bhatia) చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’, ‘పురుషన్’, ‘వీ శాంతారాం’, ‘రాకేష్ మరియా బయోపిక్’, ‘రాగిణి 3’, ‘భోలే చుడియాన్’ వంటి పలు చిత్రాలు చేస్తోంది.