Tamannaah : బోల్డ్ సీన్స్ చేస్తే హీరోలని ఎందుకు అడగరు? మమ్మల్ని మాత్రమే విమర్శిస్తారు..

అయితే తమన్నా మొదట్నుంచి కూడా చాలా గ్లామరస్ రోల్స్ చేసింది. కానీ గత కొన్ని రోజులుగా బోల్డ్ సీన్స్ ఎక్కువగా చేస్తుంది. బాలీవుడ్ లో రెచ్చిపోయి మరీ శృంగార సన్నివేశాల్లో నటిస్తుంది.

Tamannaah counter to who trolls on her for intimacy scenes

Tamannaah :  తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుసగా సినిమాలు చేస్తుంది. సౌత్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు కూడా సౌత్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇన్నాళ్లయినా ఇప్పటికి కూడా తమన్నా చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే మాములు విషయం కాదు. సినిమాలే కాకుండా మరోపక్క యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంది.

అయితే తమన్నా మొదట్నుంచి కూడా చాలా గ్లామరస్ రోల్స్ చేసింది. కానీ గత కొన్ని రోజులుగా బోల్డ్ సీన్స్ ఎక్కువగా చేస్తుంది. బాలీవుడ్ లో రెచ్చిపోయి మరీ శృంగార సన్నివేశాల్లో నటిస్తుంది. ఇటీవల జీ కర్దా సిరీస్, లస్ట్ స్టోరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ గా నటించింది. వీటిల్లో తమన్నా హద్దు దాటి మరీ ముద్దు సీన్లు, టాప్ లెస్ సీన్లు, శృంగార సన్నివేశాలు చేయడంతో అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

Anil Sunkara : అఖిల్ కోసమే అంటూ.. మరోసారి ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడిన నిర్మాత..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన బోల్డ్ సన్నివేశాలపై కామెంట్స్ చేసే వాళ్లకు కౌంటర్ ఇచ్చింది. తమన్నా మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో కూడా ఇలాంటి వ్యతిరేకత వస్తుందని నేను అనుకోలేదు. సోషల్ మీడియాలో నాపై కొంతమంది విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను కెరీర్ మొదట్లోనే చాలా గ్లామరస్ పాత్రలు చేశాను. అంతే కానీ మొదట్లో డీ గ్లామర్ పాత్రలు చేసి, పద్ధతి గల పాత్రలు చేసి ఇప్పుడు ఇలాంటివి చెయ్యట్లేదు. అయినా ఒక నటి బోల్డ్ సీన్స్ చేస్తే ఎందుకు పర్సనల్ అటాక్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. హీరోలు కూడా చాలా మంది బోల్డ్ సీన్స్ చేస్తారు, కానీ వాళ్ళని మాత్రం ప్రశ్నించరు. మేము చేస్తే మాత్రం విమర్శలు చేస్తారు. నేను ఇన్నేళ్ల కెరీర్ లో కిస్ సీన్స్ లో నటించలేదు. కెరీర్ లో ఎదగాలంటే కొన్ని మార్చుకోవాలని అర్థమైంది. అందుకే ఈ ప్రాజెక్ట్స్ చేశాను అని తెలిపింది. దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు