×
Ad

Lokesh Kanagaraj: లోకేష్ కథని రిజెక్ట్ చేసిన స్టార్.. హిట్ ఇచ్చినా పక్కన పెట్టేశాడుగా.. అలాగే ఉంటది మరి..

లోకేష్ కనగరజ్.. నిన్నమొన్నటివరకు ఈ పేరు ఒక బ్రాండ్. ఈయనతో సినిమాలు చేయడానికి చాలా(Lokesh Kanagaraj) మంది స్టార్స్ ఎగబడ్డారు కూడా. నిర్మాతలైతే తమతో సినిమాలు చేయాలని కోట్లలో రెమ్యునరేషన్స్ ఆఫర్ చేశారు.

Tamil actor Kamal Haasan rejected Lokesh Kanagaraj story

Lokesh Kanagara: లోకేష్ కనగరజ్.. నిన్నమొన్నటివరకు ఈ పేరు ఒక బ్రాండ్. ఈయనతో సినిమాలు చేయడానికి చాలా మంది స్టార్స్ ఎగబడ్డారు కూడా. నిర్మాతలైతే తమతో సినిమాలు చేయాలని కోట్లలో రెమ్యునరేషన్స్ ఆఫర్ చేశారు. లోకేష్ కూడా ఆయనకు వచ్చిన అవకాశాలన్నిటినీ సక్రమంగానే వాడుకున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఇలా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ అందించాడు. దాంతో, లోకేష్ రేంజ్ కూడా పెరిగిపోయింది. కానీ, ఒకే ఒక్క ప్లాప్ ఇప్పుడు ఆయన్ని కిందకి పడేసింది. ఎంతలా అంటే, మొన్నటివరకు వరుస అవకాశాలు అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

Anasuya Bharadwaj: చీరలో అనసూయ అందాలు.. క్రేజీ స్టిల్స్ తో ఫోజులు..

రీసెంట్ గా లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో, ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమాపై ఆ ఎఫెక్ట్ దారుణంగా పడింది. ఏ హీరో, ఏ నిర్మాత కూడా సినిమా చేయడానికి ముందుకు రావడం లేదట. అప్పటికే ఒకే అయినా ఖైదీ 2 కూడా బడ్జెట్ కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది అనే వార్తలు తమిళనాట వైరల్ అవుతున్నాయి. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా ఒక స్టార్ హీరోకి కథ వినిపించాడట లోకేష్. కానీ, ఆ కథను రిజెక్ట్ చేశాడట ఆ హీరో.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. లోకనాయకుడు కమల్ హాసన్. అవును, లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా కమల్ ని కలిసి మాఫియా బ్యాక్డ్రాప్ ఒక కథను వినిపించాడట. కానీ, కమల్ ఆ కథను రిజెక్ట్ చేశాడట. వెరీ కాంబోలో ఇప్పటికే విక్రమ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చనువుతోనే కమల్ తో మరో సినిమా ప్లాన్ చేయాలనీ చూశాడట లోకేష్. కానీ, కథలో కొత్తదనం లేకపోడంతో రిజెక్ట్ చేశాడట కమల్. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళనాట వైరల్ గా మారింది. మరి ఒక ప్లాప్ తో వెనుకబడిపోయింది లోకేష్ కి ఏ స్టార్ అవకాశం ఇస్తాడో చూడాలి.