Vijay sethupathi Cm vijay Controversy: అది నాయకత్వమా.. బిగ్ బాస్ లో విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్.. సీఎం విజయ్ టార్గెట్, నెట్టింట వీడియో రచ్చ!
బిగ్ బాస్ తమిళ సీజన్ 10 రియాలిటీ షోలో విజయ్ సేతుపతి (Vijay sethupathi Cm vijay Controversy)వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి.
tamil bigg boss host vijay sethupathi sensational comments on Cm vijay
- బిగ్ బాస్‌లో సేతుపతి కామెంట్స్
- సీఎం విజయ్‌పై పోలికల వివాదం
- క్లారిటీ ఇచ్చిన విజయ్ టీవీ
Vijay sethupathi Cm vijay Controversy: బిగ్ బాస్ తమిళ సీజన్ 10 రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. ఇటీవల ప్రసారమైన వీకెండ్ ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ లీడర్‌గా ఉన్న కంటెస్టెంట్ షాతిగ నాయకత్వ వైఖరిపై సేతుపతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచించకుండా హామీలు ఇవ్వడం, సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం, ప్రతిపక్షంపై నెట్టేయడం నిజమైన నాయకత్వం అనిపించుకోదని హెచ్చరించారు.
విజయ్ సేతుపతి వ్యాఖ్యలు.. సీఎం విజయ్‌కి లింక్:
ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో, చాలా మంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(Vijay sethupathi Cm vijay Controversy) రాజకీయ వైఖరికి ముడిపెడుతూ పోలికలు తీసుకురావడం మొదలుపెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలు కేవలం బిగ్ బాస్ హౌస్‌లో షాతిగ ప్రవర్తనను సరిదిద్దడానికే ఉద్దేశించినవి తప్ప రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసినవి కావు. విజయ్ సేతుపతి, సీఎం విజయ్‌ల మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో వీరిద్దరూ నటించిన ‘మాస్టర్’ సినిమా ప్రమోషన్లలో విజయ్ సేతుపతి విజయ్ చెంపపై ముద్దు పెట్టి తన ప్రేమాభిమానాలను చాటుకున్న విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తూ ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
విజయ్ టీవీ స్పష్టత!
ఈ సోషల్ మీడియా వివాదంపై విజయ్ టీవీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ స్పష్టతనిచ్చింది. బిగ్ బాస్ షోలో జరిగే సంభాషణలు కేవలం అందులోని కథనంలో భాగమేనని, ఏ వ్యక్తులకు, సిద్ధాంతాలకు లేదా బయటి పరిస్థితులకు ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదని తేల్చిచెప్పింది.
