Producers : స్టార్ హీరోలపై యుద్ధం చేస్తున్న తమిళ నిర్మాతలు.. టాలీవుడ్ నిర్మాతలకు ఆ ధైర్యం ఉందా?
తమిళ నిర్మాతలు ఒక అడుగు ముందుకు వేసి స్టార్ నటీనటులపై, దర్శకులపై యుద్ధం మొదలుపెట్టారు. (Producers)
- Saketh U
- Published on- May 3, 2026 / 08:56 PM IST
Producers
Producers : ఇటీవల సినిమా నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ తో పాటు నటీనటుల రెమ్యునరేషన్ పెరగడం కూడా ముఖ్య కారణం. అందులోను స్టార్ హీరోలు, హీరోయిన్స్, దర్శకులు కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది హీరోలు సినిమాలు ఫ్లాప్ అయినా కోట్లలోనే రెమ్యునరేషన్స్ అడుగుతున్నారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పట్లేదు. ఇది అన్ని సినీ పరిశ్రమలలోని ఉంది.
అయితే తమిళ నిర్మాతలు ఒక అడుగు ముందుకు వేసి స్టార్ నటీనటులపై, దర్శకులపై యుద్ధం మొదలుపెట్టారు. ఇక నుంచి సినిమాకు రెమ్యునరేషన్స్ కాకుండా వచ్చిన లాభాల్లో ప్రాఫిట్ షేరింగ్ తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీనిపై తమిళ నటీనటులు ఎవ్వరూ స్పందించలేదు. దీంతో తమిళనాడులోని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మరోసారి ఈ విషయం తమిళ నటీనటుల సంఘంకు చెప్పి ఒక్క రోజు షూటింగ్స్ బంద్ చేసింది.
Also Read : Geetha Bhagat : కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయబోతున్న యాంకర్ గీతా భగత్.. టాలీవుడ్ కోసం..
భారీ రెమ్యునరేషన్స్ వాళ్ళ నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నామని, సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయితే నిర్మాతలు కష్టాలో ఉంటే ఎవరూ ఆదుకోవట్లేదని వాపోతూ ఇకపై స్టార్ నటీనటులు, దర్శకులు ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలోనే రెమ్యునరేషన్స్ తీసుకోవాలని కోరుతూ ఒక రోజు షూటింగ్స్ అన్ని ఆపేసి బంద్ చేసారు. దీనిపై నటీనటులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
దీంతో మళ్ళీ ఈ సమ్మె చేస్తారని తెలుస్తుంది. అలాగే థియేటర్స్ లో జనాలు పెరగడానికి సినిమాలు ఓటీటీలోకి నెల రోజుల్లో రాకూడదు అని కనీసం ఆరు నుంచి 8 వారాలు గ్యాప్ ఉండాలని నిర్ణయించారు. నటీనటులు ఒప్పుకోకపోతే తమిళ నిర్మాతలు మరింత కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇలా తమిళ నిర్మాతలు చేసినట్టు టాలీవుడ్ నిర్మాతలకు ధైర్యం ఉందా అని చర్చ మొదలయింది.
Also Read : Meghana Raj : చనిపోయిన హీరో కలని తీర్చిన భార్య.. రజినీకాంత్ తో ఫొటోలు షేర్ చేసి..
మన దగ్గర కూడా స్టార్ హీరోలు వంద కోట్లు, 50 కోట్లు పైన తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక ఫ్లాప్స్ ఉన్న చిన్న, మీడియం రేంజ్ హీరోలు కూడా 5 నుంచి 20 కోట్ల రేంన్యునరేషన్స్ తీసుకుంటున్నారు. ఇందులో ఒకరిద్దరు హీరోలు సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు ఎంతో కొంత తిరిగి ఇస్తున్నారు కానీ మరికొంతమంది మాత్రం సినిమా ఫలితం ఎలా ఉన్నా సంభందం లేదన్నట్టు వ్యవహరించడమే కాక నెక్స్ట్ సినిమాలకు కూడా అంతే రెమ్యునరేషన్స్ అడగడం గమనార్హం. దర్శకులు కూడా కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకోవడం గమనార్హం. సంవత్సరంలో తీయాల్సిన సినిమాలు సాగదీసి రెండు మూడేళ్లు తీస్తూ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెంచుతున్నారు.
మరి తమిళ నిర్మాతలు చేసినట్టు మన నిర్మాతలు కూడా స్టార్ హీరోలకు, దర్శకులకు అల్టిమేటం జారీ చేయగలరా? ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో రెమ్యునరేషన్స్ తీసుకోమని చెప్పగలరా? ఒకప్పుడు చిరంజీవి అలాగే చేసేవారు. ఇప్పుడు కూడా ఒకరిద్దరు దర్శకులు అదే పని చేస్తున్నారు. మరి మిగతా స్టార్స్ ని నిర్మాతలు అడుగుతారా అనేది సందేహమే. ఇక ఓటీటీ అయితే నిర్మాతలే నెల రోజుల లోపే ఇచ్చేస్తున్నారు. మళ్ళీ థియేటర్ కి జనాలు రావట్లేదని వాళ్ళే అంటారు. హిట్ అయినా సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మరి ఇది ఆరు నుంచి 8 వారాలకు మార్చేలా నిర్మాతలు నిర్ణయం తీసుకుంటారా చూడాలి.
