Ajith Mother : తమిళ పరిశ్రమలో విషాదం.. అజిత్ తల్లి కన్నుమూత..

Ajith Mother Passes Away: తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (Ajith)

  • Updated on- May 30, 2026 / 11:32 AM IST

Tamil Star Hero Ajith Mother Mohini Passed Away

Ajith : తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ్ స్టార్ హీరో, రేసర్ అజిత్ తల్లి మోహిని నేడు ఉదయం మరణించారు. గత కొన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహిని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ 84 ఏళ్ళ వయసులో మరణించారు.

ప్రస్తుతం అజిత్ దుబాయ్ లో ఉన్నాడు. అజిత్ దుబాయ్ నుంచి వచ్చాక రేపు ఆమె అంత్యక్రియలు చేయనున్నట్టు తమిళ మీడియా సమాచారం. ఇటీవలే రెండేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతో మరణించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు అజిత్ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు.

Also Read : Sundeep Kishan : సీఎం విజయ్ ఫ్యాన్స్ చేతిలో సందీప్ కిషన్ భవిష్యత్తు..