Vijay : ఓ పక్క విడాకులు.. ఓ పక్క ఎన్నికలు.. కోట్ల విలువ చేసే ప్రాపర్టీ అమ్మేసిన విజయ్..
విజయ్ ఓ ప్రాపర్టీని అమ్మేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. (Vijay)
- Saketh U
- Published On : March 19, 2026 / 05:35 PM IST
Vijay
Vijay : తమిళ్ స్టార్ హీరో గత కొన్నాళ్లుగా తమిళనాట వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టి ప్రచారం మొదలుపెట్టారు. ఏప్రిల్ లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నాడు విజయ్. ఎలక్షన్స్ కోసం విజయ్ బిజీగా ఉన్న సమయంలో ఇటీవల విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందంటూ అతని భార్య సంగీత విడాకుల కేసు వేయడంతో సంచలనంగా మారింది.
ప్రస్తుతం విజయ్ – సంగీత విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. అయితే కోర్టు బయట 200 కోట్లు ఇచ్చి ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని విజయ్ చూస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఓ వైపు ఎన్నికల హడావిడి, మరోవైపు విడాకుల కేసు ఉన్న సమయంలో విజయ్ ఓ ప్రాపర్టీని అమ్మేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
Also See : Nabha Natesh : నభా నటేష్ ఉగాది స్పెషల్ ఫొటోలు.. ట్రెడిషినల్ లుక్స్ లో..
చెన్నై లోని అన్నా నగర్ లో విజయ్ కి ఉన్న ఓ ప్రాపర్టీని 35 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. అలాగే చెన్నైలోని మరి కొన్ని ప్రాపర్టీలను కూడా అమ్మడానికి విజయ్ చూస్తున్నట్టు సమాచారం. వాటికి కూడా బేరసారాలు జరుగుతున్నాయని తమిళ మీడియా అంటుంది. ఎన్నికల ఖర్చు కోసం విజయ్ ఈ ప్రాపర్టీలను అమ్మేస్తున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
