×
Ad

Karthi: ఓపక్క అన్నతో.. ఇప్పుడు తమ్ముడితో.. మ్యాడ్ దర్శకుడిని సెట్ చేసిన నాగవంశీ

మ్యాడ్ దర్శకుడితో సినిమా చేస్తున్న తమిళ స్టార్ కార్తీ(Karthi).

tamil star karthi doing his next movie with director kalyan shankar

  • మ్యాడ్ దర్శకుడితో కార్తీ మూవీ
  • నిర్మాతగా నాగవంశీ
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ టైం ఏంటో అస్సులు బాలేదు. రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. సర్దార్ తరువాత ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన వా వతియార్ కూడా సూపర్ ప్లాప్ అయ్యింది. దీంతో, ఇప్పుడు అర్జెంటుగా కార్తీకి ఒక హిట్ కావాలి. అందుకే, ఒక తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

అవును, ఆ దర్శకుడు మీరెవరో కాదు కళ్యాణ్ శంకర్. మ్యాడ్, మ్యాడ్ 2 చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ఈ దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలు చేయడంలో మనోడు ఫేమస్. అందుకే, ఇప్పుడు హిట్ కావాలంటే కామెడీ సినిమానే కరక్ట్ అని భావిస్తున్నాడట కార్తీ(Karthi). అందుకే, కళ్యాణ్ శంకర్ ను కన్సీడర్ చేస్తున్నాడట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నాడట.

Balakrishna: మార్కో డైరెక్టర్ తో బాలకృష్ణ.. బాక్సాఫీస్ ఊచకోతకు దిల్ రాజు రెడీ

నాగవంశీ ప్రస్తుతం కార్తీ అన్న సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన కార్తీకి దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో ఒక కథను చెప్పించాడట. ఆ కథ కార్తీకి బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేశాడట. అలా కార్తీతో సినిమా సెట్ చేశాడట నాగ వంశీ. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.

ప్రస్తుతం కార్తీ దర్శకుడు పీఎస్ మిత్రన్ తో సర్ధార్ 2 సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ సర్ధార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే కళ్యాణ్ శంకర్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడట కార్తీ. మరి ఈ సినిమా కార్తీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చూడాలి.