Balakrishna: మార్కో డైరెక్టర్ తో బాలకృష్ణ.. బాక్సాఫీస్ ఊచకోతకు దిల్ రాజు రెడీ
మార్కో సినిమా దర్శకుడితో వైలెంట్ మూవీ చేయనున్న బాలకృష్ణ(Balakrishna).
Balakrishna doing a movie with Marco film director Haneef Adeni.
- మార్కో డైరెక్టర్ తో బాలకృష్ణ మూవీ
- మోస్ట్ వైలెంట్ అవతారంలో బాలయ్య
- క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్న దిల్ రాజు
Balakrishna: మార్కో.. సినీ ప్రేక్షకులు ఎవరు ఈ సినిమాను మర్చిపోలేరు. మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఈ సినిమాలో చూపించిన ఊచకోతకు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మార్కో 2 కూడా వస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఒక్క సినిమాతో దర్శకుడు హనీఫ్ అదేని ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే, ఈ దర్శకుడు ఇటీవల నందమూరి బాలకృష్ణను కలిశాడట. ఆయనకు ఒక సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను వినిపించాడట. ఆ కథ బాలయ్య బాడీ లాన్గ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందట. మార్కో లాగే ఇది కూడా పక్కా మాస్ సబ్జెక్టు కావడంతో బాలకృష్ణ కూడా వెంటనే ఓకే చెప్పేశాడట.
Siri Hanmanth: గ్రీన్ డ్రెస్సులో గ్లామర్ షో చేసిన సిరి.. లేలేత అందాలు అదరహో.. ఫొటోలు
నిజానికి మాస్ అనే పదానికి పెఫెక్ట్ హీరో అంటే బాలయ్య అనే చెప్పాలి. అలాంటి హీరో మార్కో సినిమాలో మాదిరి విలన్స్ మీద పడి ఊచకోత కొస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఈ కథను వెంటనే ఒకే చేశాడట బాలయ్య(Balakrishna). ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించనున్నాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి, ఆ సినిమా విడుదల అయిన తరువాత మార్కో డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు బాలకృష్ణ. ఆలోపు దర్శకుడు హనీఫ్ అదేని మార్కో 2 సినిమాను కంప్లీట్ చేస్తాడు. మరి అసలు ఎవరూ ఊచించని కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
