Tarakaratna-Balakrishna : బాలయ్య బాబాయ్ తో నటించాలనే కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న
తారకరత్నకు ఉన్న ఓ కోరిక తీరకుండానే మరణించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్నకు బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తారకరత్న చాలా సార్లు ప్రస్తావించారు. తన బాబాయ్ బాలయ్యతో తారకరత్న క్లోజ్ గా ఉండేవారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటించాలని ఉందని..............
- Saketh U
- Published On : February 19, 2023 / 11:55 AM IST
Tarakaratna wants to act with babai Balakrishna in a movie but unfortunately it doesn't happen
Tarakaratna-Balakrishna : నటుడు నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. తెలుగు సినీపరిశ్రమలో గత కొంత కాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తూ విషాదాన్ని మిగిల్చారు. తాజాగా తారకరత్న మృతి చెందడంతో మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ తారకరత్న అకస్మాత్తుగా శనివారం రాత్రి అకాల మరణం చెందడం బాధాకరం. ఇప్పటికే పలువురు సినీ, రాజక్రీయ ప్రముఖులు తారకరత్న ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Tarakaratna : నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టిన రోజు.. కానీ అంతలోనే ఇలా..
అయితే తారకరత్నకు ఉన్న ఓ కోరిక తీరకుండానే మరణించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్నకు బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తారకరత్న చాలా సార్లు ప్రస్తావించారు. తన బాబాయ్ బాలయ్యతో తారకరత్న క్లోజ్ గా ఉండేవారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటించాలని ఉందని, ఆయన సినిమాల్లో చిన్న పాత్ర అయినా సరే చేస్తానని చెప్పారు. దీంతో బాలకృష్ణతో కలిసి నటించాలనే కోరిక తీరకుండానే తారకరత్న కన్నుమూయడం బాధాకరం అని నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ ఇద్దర్నీ కలిసి ఒకేసారి తెరపై చూసే అదృష్టం లేకపోయింది అని బాధపడుతున్నారు.
