‘బిగ్‌బాస్’లో పార్టిసిపేట్ చేయట్లేదు..
- sekhar
- Published On : July 22, 2020 / 02:00 PM IST
‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 4కి సంబంధించిన అఫీషియల్ లోగోను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకి సంబంధించి ఈ సీజన్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలకు తెరదించుతూ.. ‘అతి త్వరలో..’ అంటూ ‘బిగ్‌బాస్’ సీజన్ 4 లోగో విడుదల ప్రోమోలో తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లు జూన్, జూలై నెలల్లోనే ప్రారంభం అయ్యాయి. కానీ ఈసారి ఈ షో కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. కరోనా ఎఫెక్ట్. అయితే ఈ సీజన్‌కు సంబంధించి కొందరు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అందులో హీరో తరుణ్ పేరు కూడా ఉంది. అయితే ‘బిగ్‌బాస్’లో తాను పాల్గొంటున్నట్లుగా వస్తున్న వార్తల్ని తరుణ్ ఖండించారు. తాజాగా ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
