Hanuman : శివరాత్రి రోజు హనుమంతుడి ఆగమనం.. ‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..

సంక్రాంతికి రిలీజయిన స్టార్ హీరోల సినిమాలు గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్.. ఆల్రెడీ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు.

Teja Sajja Hanuman Movie OTT Streaming Details

Hanuman Movie : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో ఫిలిం తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి రిలీజయి బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. చిన్న సినిమాగా రిలీజయి ఏకంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టేసింది. ఎవరూ ఊహించని భారీ విజయం హనుమాన్ సాధించింది. తాజాగా నేడు ఈ సినిమా 50 రోజులకు చేరుకుంది.

సంక్రాంతికి రిలీజయిన స్టార్ హీరోల సినిమాలు గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్.. ఆల్రెడీ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. తాజా సమాచారం ప్రకారం హనుమాన్ సినిమా శివరాత్రి సందర్భంగా జీ5 ఓటీటీలో మార్చ్ 8 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో శివరాత్రి రోజు హనుమంతుడు ఆగమనం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Also Read : SSMB29 : పొలిటికల్ లీడర్స్‌తో రాజమౌళి భేటీ.. SSMB29 మూవీ గురించి చర్చ..

థియేటర్స్ లో ఈ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేయడానికి ఎదురుచూస్తున్నారు. ఇక హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్స్ కూడా మొదలుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు