పవన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి తల్లి కాబోతుంది!

హీరోయిన్ అనీషా అంబ్రోస్ తల్లి కాబోతుంది.. ఈ విషయాన్ని తేజస్వి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..

  • Publish Date - April 15, 2020 / 02:53 PM IST

హీరోయిన్ అనీషా అంబ్రోస్ తల్లి కాబోతుంది.. ఈ విషయాన్ని తేజస్వి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎవరా హీరోయిన్.. ఏంటా కథ.. అంటే.. ఆ కథానాయిక పేరు అనీషా అంబ్రోస్. ఈమె పవన్ పక్కన నటించలేదు కానీ ‘పవన్ హీరోయిన్’ అనే స్టాంప్ పడడంతో బాగా గుర్తింపు తెచ్చుకుంది.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు రాహుల్ వెంకట్ హీరోగా పరిచయమైన ‘అలియాస్ జానకి’ మూవీతో అనీషా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వెంకీ, పవన్ నటించిన ‘గోపాల గోపాల’ తర్వాత పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో నటించనుందని వార్తలు రావడంతో అనీషా పాపులర్ అయింది. తర్వాత ఆ స్థానంలో కాజల్ రావడం, అనీషా అడపాదడపా సినిమాలు చేసి, పెళ్లి చేసుకోవడం చకాచకా జరిగిపోయాయి.
Read Also : ఏడాది వరకు నో థియేటర్స్?..

ఇప్పుడామె గర్భవతి. ఈ విషయాన్ని అనీషా ఫ్రెండ్ యంగ్ యాక్ట్రెస్ తేజస్వి మడివాడ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. దీంతో పవన్ కళ్యాణ్ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే వార్త వైరల్‌గా మారింది. కాగా అనీషా చివరిసారిగా ‘సెవెన్’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో కనిపించింది.