Gaddar Awards: అన్న గురించి తమ్ముడు.. కొడుకు గురించి తండ్రి.. గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన వేళ స్పెషల్ మూమెంట్స్
2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులు(Gaddar Awards) ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- V Santhosh Kumar
- Published On : March 7, 2026 / 03:49 PM IST
Telangana government announces Gaddar Awards
- అన్నయ్యకు అవార్డు రావడం ఆనందాన్ని కలిగించింది
- చైతన్య ఈ అవార్డుకు పూర్తిగా అర్హుడు
- గద్దర్ అవార్డుల వేళ పవన్, నాగ్ నుంచి స్పెషల్ పోస్టులు
Gaddar Awards: తెలంగాణ గవర్నమెంట్ తాజాగా గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో విడుదలైన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది రాష్ట్ర సర్కార్. దీంతో, అవార్డులు సాధించిన విజేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అవార్డుల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సర్కార్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించింది. దీంతో, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా తన అన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
చిరంజీవి గారికి తెలంగాణ సర్కార్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకు చిరంజీవి గారికి నా శుభాకాంక్షలు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ప్రయాణం ఎందరికి స్ఫూర్తిదాయకం. అలాగే గద్దర్ అవార్డులు అందుకున్న ప్రతీ ఒక్కరికీ నా శుబాకాంక్షలు. అంటూ తెలిపారు. ఇక అక్కినేని నాగార్జున సైతం తన కొడుకు నాగ చైతన్యకు శుభాకాంక్షలు తెలిపారు.
అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డు(Gaddar Awards) అందుకున్నాడు. ఈ సందర్బంగా నాగార్జున స్పందిస్తూ.. తండేల్ సినిమాలో చైతన్య అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుకు చైతన్య తప్పకుండా అర్హుడు.‘దుల్ల కొడతా నాన్న’. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. నాన్న ఏయన్నార్ పేరుతో అవార్డును ప్రకటించడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ అవార్డు జయసుధకు రావడం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు. దీంతో, నాగార్జున చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
