Telugu – Tamil Movies : అటు తమిళ్.. ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్‌లో..

అటు తమిళ్, ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్‌ పై దండయాత్ర చేయబోతున్నారు. అసలైన మూవీ కార్నివాల్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండబోతుంది.

Telugu – Tamil Movies : అటు తమిళ్.. ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్‌లో..

Telugu and Tamil star hero Movies releases in 2024 second half

Telugu – Tamil Movies : 2024 ఫస్ట్ హాఫ్ లో సినిమాల సందడి పెద్దగా కనిపించడం లేదు. అసలైన మూవీ కార్నివాల్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండబోతుంది. అటు తమిళ్, ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్‌ పై దండయాత్ర చేయబోతున్నారు.

Pushpa 2..
పుష్ప 1తో భారీ విజయాన్ని నమోదు చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2తో అంతకుమించి విజయాన్ని నమోదు చేయడం కోసం సిద్ధమవుతున్నారు. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

They Call Him OG..
పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు నిర్మాతలు తెలియజేసారు.

Devara..
కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.

Kalki 2898 AD..
ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ మేలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్ వల్ల పోస్టుపోన్ అవుతుంది. దింతో ఈ సినిమాని జులైలో తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

Also read : Devara : ప్రీ రిలీజ్ బిజినెస్‌తో దేవర రికార్డులు.. వంద, రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా..!

Game Changer..
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాని సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరిలో రిలీజ్ చేస్తామంటూ రామ్ చరణ్ ఇటీవల తెలియజేసారు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

Thandel..
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘తండేల్’. గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తెలుగు సినిమాలు ఇలా ఉంటే.. తమిళంలో తెరకెక్కుతున్న బడా సినిమాలు కూడా సెకండ్ హాఫ్ పైనే ఫోకస్ చేశాయి. కమల్ హాసన్ ఇండియన్ 2ని జూన్‌లోనే తీసుకు వస్తుంటే.. విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సెప్టెంబర్‌లో, రజినీకాంత్ ‘వెట్టియాన్’ అక్టోబర్‌లో వస్తున్నాయి. అలాగే అజిత్ కుమార్ ‘విడ ముయిర్చి’, సూర్య ‘కంగువ’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘కుబేర’ చిత్రాలు కూడా 2024 సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ కాబోతున్నాయి.