Bigg Boss 7 : బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్స్‌కి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు..?

బిగ్‌బాస్ 7 హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఎవరెవరికి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..?

Telugu Bigg Boss 7 contestants remuneration details

Bigg Boss 7 : తెలుగు బిగ్‌బాస్ 7 నిన్న సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం అయ్యింది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఎటువంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారో అని అందరి ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ సీజన్ లో దాదాపు తెలిసిన వారే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక జైన్, శివాజీ, దామిని, ప్రిన్స్ యావర్, శుభశ్రీ రాయగురు, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ మొదటిరోజు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Music Director Dasi : ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..

కాగా వచ్చే ఎపిసోడ్స్ లో మరికొంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ గా వచ్చిన వారి రెమ్యూనరేషన్స్ ఎంతెంత ఉంటుందో తెలుసా..? ఆయా కంటెస్టెంట్ ఫేమ్ ని బట్టి, ఆ వ్యక్తికి బయట ఎంత సంపాదన వస్తుందనే దాని బట్టి రెమ్యూనరేషన్ సెట్ చేస్తారు. మొదటి కంటెస్టెంట్ ప్రియాంక జైన్.. సీరియల్స్ తో మంచి ఫేమ్ నే సంపాదించుకుంది. అలాగే బాగానే సంపాదిస్తుంది కూడా, కాబట్టి ఈమెకు.. వారానికి 2.4 లక్షలు ఇస్తున్నారని సమాచారం.

Rashmika Mandana : ర‌ష్మిక కాళ్లు మొక్కిన అసిస్టెంట్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

అలాగే సింగర్ దామనికి 2 లక్షలు, రతిక రోజ్ కి 2 లక్షలు, శోభా శెట్టికి 2.25 లక్షలు, కిరణ్ రాథోడ్ కి 3 లక్షలు, పల్లవి ప్రశాంత్ కి 1 లక్ష, టేస్టీ తేజ 1.5 లక్షలు, శుభశ్రీ రాయగురుకి 2 లక్షలు, గౌతమ్ కృష్ణకి 1.75 లక్షలు, ప్రిన్స్ యావర్ కి 1.5 లక్షలు, ఆట సందీప్ కి 2.75 లక్షలు, అమర్ దీప్ కి 2.5 లక్షలు.. ప్రతి వారానికి రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇక హౌస్ మొత్తం ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న కంటెస్టెంట్స్.. శివాజీ, షకీలా అని వినిపిస్తుంది. షకీలాకి 3.5 లక్షలు, శివాజీకి 4 లక్షలు ఇస్తున్నారని సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు