Telugu Indian Idol : పవన్ కళ్యాణ్ OG సినిమాలో.. పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్..
తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 సెమీ-ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
- Saketh U
- Published On : September 7, 2024 / 06:11 PM IST
Telugu Indian Idol Season 3 Contestants Sing a Song for Pawan Kalyan OG Movie
Telugu Indian Idol : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గా సాగుతుంది. గ్రాండ్ ఫినాలేకి మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరింది. దాదాపు 15,000 మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేసి ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేసి ఈ సీజన్ స్టార్ట్ చేసారు. భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం.. ఇలా 12 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలుపెట్టారు.
ప్రతి ఎపిసోడ్ కి ఎవరో ఒకరు స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చి మరింత ఇంట్రెస్టింగ్ గా తీశారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. గత 24 ఎపిసోడ్‌లలో ఎలిమినేషన్‌లు, పబ్లిక్ ఓటింగ్ తర్వాత ఇప్పుడు ఆరుగురు ఫైనలిస్టులకు పోటీ వచ్చింది. అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, భరత్, నసీరుద్దీన్ ఫైనల్ కి వెళ్లడానికి పోటీ పడుతున్నారు.
Also Read : ‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్‌లుక్ విడుదల.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా
తాజాగా సెమీ-ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు. వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయ సంగీతానికి అనుగుణంగా పాటలు పాడారు. అయితే ఈ ఎపిసోడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కంటెస్టెంట్స్ నసీరుద్దీన్, భరత్ లు పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఓ పాట పాడారని, ఆ పాట విని మన డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దర్ని అభినందించారని తెలిపాడు.
దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. అప్పుడే వీళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాకు పాట పాడేశారా అని ఆశ్చర్యపోతూనే, OG సినిమా పాటల వర్క్ అయిపొయింది అని అంచనా వేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఆహా ఓటీటీలో కొత్త ఎపిసోడ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఈ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా ఎవరు గెలుస్తారో చూడాలి.
https://www.youtube.com/watch?v=FfsI3Z9V9V4
