Prabhas : ప్రభాస్, మారుతి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్!
ప్రభాస్, మారుతీ సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత టి జి విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- gum 95921
- Published On : June 13, 2023 / 05:53 PM IST
TG Vishwaprasad interesting comments on Prabhas and Maruthi movie
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ (Salaar), ప్రాజెక్ట్ K (Project K) సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలతో పాటు దర్శకుడు మారుతీతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటికి ఇప్పటి వరకు మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే చిత్ర షూటింగ్ మాత్రం సాగుతుంది. ఇప్పటికే మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆ ఫొటోల్లో ప్రభాస్ లుక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.
Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?
తాజాగా ఈ నిర్మాణ సంస్థ అధినేత టి జి విశ్వప్రసాద్ ప్రభాస్, మారుతీ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించగా, నిర్మాత బదులిస్తూ.. “ప్రతి సినిమాకి ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం. ఆ సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను” అంటూ వెల్లడించాడు. ఆ సినిమాకి సంబంధించి పెద్ద విషయాలు చెప్పనప్పటికీ నిర్మాత నుంచి ప్రాజెక్ట్ పై అధికారికంగా కన్‌ఫార్మ్ అవ్వడంతో అభిమానులు హ్యాపీ అవుతున్నారు.
Adipurush : హనుమంతుడి పక్క సీటు రేటుపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. ఎంతో తెలుసా..?
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిధి కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఒక థియేటర్ సెట్ ని నిర్మించారట. గతంలో మారుతీ ‘ప్రేమకథా చిత్రం’ వంటి హారర్ కామెడీతో ఆడియన్స్ ని బాగా అలరించాడు. మరి ఈ చిత్రంతో ఎటువంటి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడో చూడాలి.
