Valimai : ‘భీమ్లా నాయక్’ తర్వాత రోజే ‘తల’ అజిత్ సినిమా!
2022 సంక్రాంతికి ‘తల’ అజిత్ కుమార్ ‘వలిమై’ బాక్సాఫీస్ బరిలో దిగబోతుంది..
- sekhar
- Published On : November 30, 2021 / 11:26 AM IST
Valimai
Valimai: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత వెంటనే నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ‘వలిమై’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అజిత్ హీరోగా నటిస్తున్న 60వ సినిమా ఇది..
Thala Ajith Kumar : ముచ్చటగా మూడోసారి.. ‘వలిమై’ విడుదలకు ముందే ‘తల’ 61 ప్రారంభం..!
టాలీవుడ్ హీరో, ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు.. హ్యూమా ఖురేషి కథానాయిక. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లకు రెస్పాన్స్ అదిరిపోయింది. అజిత్ గాయపడడం వల్ల తర్వాత లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. రీసెంట్‌గా రిలీజ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు టీం.
Bheemla Nayak : నో డౌట్.. సంక్రాంతికే సినిమా..
2022 సంక్రాంతికి ‘వలిమై’ బాక్సాఫీస్ బరిలో దిగబోతుంది. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు.
Radhe Shyam : ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ భలే ఉందిగా..
