Vijay : దళపతి విజయ్ చివరి సినిమా అదేనా? తెలుగు నిర్మాత – తమిళ్ డైరెక్టర్?

రాజకీయాల్లోకి వెళ్లేముందు లాస్ట్ సినిమా పొలిటికల్ గా కూడా ఉపయోగపడాలి కాబట్టి ఏదైనా సోషల్ మెసేజ్ తో సినిమా తీయాలని విజయ్ భావిస్తున్నాడట.

Thalapathy Vijay Last Movie Details Before He enters into Politics

Thalapathy Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవలే పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణల్లో మార్పు తీసుకురావడం కోసం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి “తమిళగ వెట్రి కజగం”(Tamizhaga Vetri Kazhagam)అనే పార్టీని అధికారికంగా ప్రకటించారు.

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలియడంతో అభిమానులు ఓ పక్క ఆనందిస్తూనే, మరో పక్క సినిమాలకు దూరమవుతాడని బాధపడుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతో సినిమాలు ఆపేస్తాడని కూడా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అతని చివరి సినిమా ఎలాంటిది తీస్తాడు? ఎవరితో తీస్తాడు అని చర్చగా మారింది.

ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత రెండు సినిమాలు చేసి 70 సినిమాలతో ఆపాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ 69వ సినిమానే లాస్ట్ సినిమా అవ్వొచ్చు అని కూడా తెలుస్తుంది. RRR సినిమా తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి విజయ్ గతంలో ఓ సినిమా చేస్తానని చెప్పినట్ట్టు సమాచారం. దీంతో తన లాస్ట్ సినిమా DVV ఎంటర్టైన్మెంట్స్ లో ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Premam : మూడోసారి రీ రిలీజ్ అయినా కోట్లు కొల్లగొడుతున్న ఆ సినిమా

ఇక రాజకీయాల్లోకి వెళ్లేముందు లాస్ట్ సినిమా పొలిటికల్ గా కూడా ఉపయోగపడాలి కాబట్టి ఏదైనా సోషల్ మెసేజ్ తో సినిమా తీయాలని విజయ్ భావిస్తున్నాడట. తమిళ్ లో అలాంటి సోషల్ మెసేజ్ తో పాటు రా & రస్టిక్ గా సినిమాలు తీసే వెట్రిమారన్ తో విజయ్ సినిమా ఉంటుందని సమాచారం. దీంతో విజయ్ చివరి సినిమా తెలుగు నిర్మాత DVV దానయ్య – తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తుంది. అదే చివరి సినిమా అవుతుందా? లేదా పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాల్లోకి వెళ్ళాక కూడా విజయ్ సినిమాలు తీస్తాడా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు