Thaman S : హాస్పిటల్ బెడ్ పై ఉన్న వ్యక్తికి థమన్ సాయం.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్లు..
టాలీవుడ్ లో థమన్ సంగీతానికే కాదు, అతనికి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా థమన్ చేసిన ఒక పనికి నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.
- gum 95921
- Published on- April 21, 2023 / 07:01 PM IST
Thaman S helped tollywood musician
Thaman S : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ట్యూన్స్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తుంటాడు. తన మ్యూజిక్ ఇచ్చిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ మేనేజ్మెంట్ కి చెమటలు పడుతుంటాయి. ఎందుకంటే తన మ్యూజిక్ తాకిడిని తట్టుకోలేక ఎక్కడ స్పీకర్లు కాలిపోతాయోనని. టాలీవుడ్ లో థమన్ సంగీతానికే కాదు, అతనికి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా, క్రికెట్ ప్లేయర్ గా ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.
Game Changer : ఇండియన్ 2 నుంచి గేమ్ చెంజర్కి శంకర్ షిఫ్ట్.. అప్పుడే క్లైమాక్స్ షూట్?
తాజాగా థమన్ చేసిన ఒక పనికి నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రముఖ తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కి థమన్, గీతామాధురి జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో గీతామాధురి థమన్ చేసిన ఒక మంచి పనిని ఆడియన్స్ కి తెలియజేసింది. ఒక మ్యూజిషియన్ కాన్సర్ రావడంతో కీమో ట్రీట్మెంట్ చేయించారు వాళ్ళ కుటుంబసభ్యులు. ఆ ట్రీట్మెంట్ వల్ల ఆ మ్యూజిషియన్ బాడీ మొత్తం కాలిపోయిందట. దీంతో అతనిని హాస్పిటల్ నుంచి తీసుకు వెళ్ళిపోదాం అని అనుకుంటే.. హాస్పిటల్ వాళ్ళు డబ్బు కడితే గాని పంపించామన్నారు. ఈ విషయం తెలుసుకున్న థమన్ వెంటనే 10 లక్షలు ఇచ్చినట్లు గీతామాధురి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
SSMB28: టైటిల్ అనౌన్స్మెంట్తో ల్యాండ్ అవుతున్న బాబు.. మామూలుగా ఉండదట!
కాగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్ని థమన్ చేతిలోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ OG, మహేష్ బాబు SSMB28, రామ్ చరణ్ గేమ్ చెంజర్, బాలకృష్ణ NBK108. ఈ సినిమాలు పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రాలకు థమన్ తన సంగీతం ఎటువంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.
