The Godfather Al Pacino went to for DNA test with doubt about his lover pregnancy
The Godfather Al Pacino : హాలీవుడ్ ‘ది గాడ్‌ఫాదర్’ సినిమా నటుడు ‘అల్ పచినో’ 83 ఏళ్ళ వయసులో తండ్రి కాబోతున్న విషయం ఇటీవల బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా 29 ఏళ్ల తన ప్రేయసితో కావడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అల్ పచినో గత కొంత కాలంగా 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో సహజీవనం చేస్తూ వస్తున్నాడు. ఈమె గత ఏడాదిలో ప్రెగ్నెంట్ కాగా.. ఇప్పుడు 8 నెలలు గర్భంతో ఉంది. అయితే అల్ పచినోకి తన ప్రియురాలి పై డౌట్ కలిగింది.
Vishwak Sen : విశ్వక్ సేన్ అసలు పేరు ఏంటో తెలుసా..? ఆ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా..?
83 ఏళ్ల వయసులో తండ్రి కావడం ఏంటి? తనకి ఇంకా ఆ సామర్ధ్యం ఉందా? అనే డౌట్ కలిగింది. దీంతో అసలు నూర్ జన్మనివ్వబోతున్న బేబీ తన బిడ్డనే? కదా? అని తెలుసుకోవాలని అనుకున్నాడట. ఈ క్రమంలోనే DNA టెస్ట్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఈ టెస్ట్ లో నూర్ గర్భంలో ఉన్న బిడ్డ అల్ పచినోదే అని రిపోర్ట్ లు వచ్చాయట. ఇక కొన్ని రోజుల్లో ఈ 83 ఏళ్ళ గాడ్ ఫాదర్ డాడీ కాబోతున్నాడు. కాగా అల్ పచినో.. నూర్ కంటే ముందు ఇద్దరితో డేటింగ్ చేసి తండ్రి అయ్యాడు. 1989లో యాక్టింగ్ కోచ్ జన్ తరంత్ తో సహజీవనం చేసి జూలీ అనే పాపకి తండ్రి అయ్యాడు.
Pawan Kalyan : వారాహి షెడ్యూల్ రిలీజ్ చేసిన పవన్.. మరి మూవీ షెడ్యూల్స్ సంగతి ఏంటి?
అయితే బిడ్డ పుట్టిన తరువాత కూడా పెళ్లి చేసుకోకుండానే కొంతకాలానికి విడిపోయారు. ఆ తరువాత యాక్ట్రెస్ బెవర్లీ డియాంగిలోతో డేటింగ్ చేసి ఇద్దరి కవలలకు తండ్రి అయ్యాడు. ఇక ఆమెతో కూడా బ్రేకప్ చెప్పి విడిపోయాడు. ఇప్పుడు నూర్ అల్ఫల్లాతో డేటింగ్ చేసి మరోసారి తండ్రి అయ్యాడు. కాగా నూర్ అల్ఫల్లా కూడా అల్ పచినో కంటే ముందు ఇద్దరితో రిలేషన్ లో ఉండి బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు అల్ అండ్ నూర్‌లు ఇద్దరు మూడో రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు.