The Rajasaab OTT: రేపే ఓటీటీలోకి ‘ది రాజాసాబ్’.. ఎక్స్టెండెడ్ కట్ తో సరికొత్తగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ ది రాజాసాబ్(The Rajasaab OTT) సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది.
- V Santhosh Kumar
- Published On : February 5, 2026 / 03:30 PM IST
The raja saab movie extended version coming to OTT.
- ఓటీటీలోకి వస్తున్న ప్రభాస్ ది రాజాసాబ్
- జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్
- ఎక్స్టెండెడ్ వెర్షన్ తో సరికొత్తగా రానున్న సినిమా
The Rajasaab OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజసాబ్(The Rajasaab OTT). దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న వచ్చిన ఈ సినిమా కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. దీంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
Bhumika Chawla: యుఫోరియా మూవీ ప్రమోషన్స్ లో భూమిక చావ్లా.. క్యూట్ ఫొటోలు
ఈనేపథ్యంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు మేకర్స్. అధికారిక ప్రకటన ప్రకారం ది రాజాసాబ్ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జియో హాట్‌స్టార్ ది రాజాసాబ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. అయితే, ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో ఆడియన్స్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ది రాజాసాబ్ సినిమా థియేటర్స్ వెర్షన్ లో చాలా సీన్స్ ని కట్ చేశారు. కానీ, ఓటీటీలో మాత్రం కీలక సన్నివేశాలను యాడ్ చేసినట్టుగా తెలుస్తోంది.
కాబట్టి, ది రాజాసాబ్ సినిమా ఓటీటీలో ఎక్స్టెండెడ్ వెర్షన్ తో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధం అయ్యింది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు. ది రాజాసాబ్ సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే. ఈ సినిమాను థియేటర్స్ లో చాలా తక్కువ మంది చూశారు. కాబట్టి, ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. కాబట్టి, తేది రాజాసాబ్ సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
