The Red Bag : సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘రెడ్ బ్యాగ్’..

నేడు సడెన్ గా ది రెడ్ బ్యాగ్ సినిమా విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. (The Red Bag)

  • Published on- August 16, 2026 / 05:45 PM IST

The Red Bag

The Red Bag : మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ ప్రమోషన్స్ చేసారు.

Also Read : Ameerlog : అమీర్ లోగ్ ముగ్గురు హీరోలు.. MC హరి, మనోజ్, శశిధర్.. సినిమా గురించి ఏం చెప్పారంటే..

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న రిలీజ్ డేట్ ప్రకటించలేదు. నేడు సడెన్ గా ది రెడ్ బ్యాగ్ సినిమా విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. ఆగస్ట్ 21న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. కేవలం 5 రోజుల ముందే రిలీజ్ డేట్ ని ప్రకటించడం గమనార్హం. ఈ సినిమాని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ రిలీజ్ చేయడం విశేషం.