Oh Sukumari Trailer : ఐశ్వర్య రాజేష్ ‘ఓ.! సుకుమారి’ ట్రైలర్ రిలీజ్.. ముట్టుకుంటే షాక్..
మీరు కూడా ఓ.! సుకుమారి ట్రైలర్ చూసేయండి.. (Oh Sukumari Trailer)
- Saketh U
- Published on- July 10, 2026 / 06:47 PM IST
Oh Sukumari Trailer
Oh Sukumari Trailer : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి నిర్మాణంలో భరత్ దర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జూలై 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నపట్నుంచి ముట్టుకుంటే షాక్ కొట్టే హీరోయిన్, ఆమెకు ఎలా పెళ్లి చేయాలి అని తంటాలు, అది తెలియక పెళ్లి చేసుకున్న హీరో అనే ఆసక్తికర కథాంశంతో కామెడీ ఎమోషనల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Vasudheva Sutham Review : ‘వసుదేవసుతం’ మూవీ రివ్యూ.. పూరి ఆలయం బ్యాక్ డ్రాప్‌లో డివోషనల్ టచ్ తో..
మీరు కూడా ఓ.! సుకుమారి ట్రైలర్ చూసేయండి..
