Papam Pratap Movie: చిక్కుల్లో చిన్న సినిమా.. ‘పాపం ప్రతాప్’ సినిమాకు సెన్సార్ షాక్
Papam Pratap Movie Censor: సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్న తిరువీర్ పాపం ప్రతాప్(Papam Pratap) మూవీ.
- V Santhosh Kumar
- Updated on- April 17, 2026 / 12:32 PM IST
papam Pratap Movie in Censor Troubles
- పాపం ప్రతాప్ సినిమాకు సెన్సార్ సమస్యలు
- యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి నో NOC
- ప్రీమియర్ షోలపై సందిగ్ధం
Papam Pratap: తిరువీర్ కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్(Papam Pratap)’. ఈ సినిమాకు విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఊహించని అడ్డంకి ఎదురైంది. ప్రమోషన్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రేపు (ఏప్రిల్ 17) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ లభించకపోవడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు ఆందోళనలో పడింది. సెన్సార్ నిబంధనల ప్రకారం సినిమాలో జంతువులను ఉపయోగించినప్పుడు ‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ నుండి తప్పనిసరిగా ఎన్ఓసి (NOC) తీసుకోవాల్సి ఉంటుంది.
*బుల్లితెరపైకి రోజా గ్రాండ్ రీ-ఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’తో సరికొత్త హంగామా!
కానీ, ఈ ఎన్ఓసి లేకపోవడంతో సెన్సార్ బోర్డు తుది సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఫలితంగా ఈరోజు సాయంత్రం ప్లాన్ చేసిన ప్రీమియర్ షోల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఈటీవీ విన్, చిత్ర నిర్మాతలు యుద్ధ ప్రాతిపదికన యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేవలం రూ.100 టికెట్ ధరతో సామాన్యులకు సినిమాను చేరువ చేయాలని తిరువీర్ వినూత్నంగా ప్రమోషన్లు నిర్వహించారు. ఇంతటి ఉత్సాహం మధ్య చివరి నిమిషంలో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం మేకర్స్‌ను ఇబ్బంది పెడుతోంది.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అభ్యంతరకర దృశ్యాలను తొలగించడం లేదా అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించి క్లియరెన్స్ పొందడం జరుగుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ క్లియరెన్స్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు సర్టిఫికేట్ రాకపోతే ప్రీమియర్ షోలతో పాటు రేపటి విడుదల కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
