This Is The Prakash Raj Panel In Maa Elections
MAA Elections: కరోనా తగ్గి ఒక్కొక్కటిగా సినిమా షూటింగ్స్ మొదలవుతుండగా మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు సినీ పరిశ్రమలో రసవత్తరంగా మారాయి. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగడంతో యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను తనవైపుకు తిప్పుకోగా జీవితా రాజశేఖర్ కూడా పోటీకి దిగడంతో మా ఎన్నిక త్రిముఖ పోటీగా మారిందని అనుకున్నారు. కానీ అంతలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా కూడా రంగంలోకి దిగడంతో మా ఎన్నికలా మజాకా అన్న చందంగా మారింది.
ఇక ఈరోజు ఎన్నికలు.. సన్నాహాలపై సమావేశం నిర్వహించిన ప్రకాష్ రాజ్ ప్యానల్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వివరించారు. కాగా.. అసలు ఎవరెవరు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీకి దిగనున్నారనేది ఆసక్తిగా మారింది. తన ప్యానల్ లో నలుగురు అధ్యక్ష అభ్యర్థులున్నారని ప్రకాష్ రాజ్ వెల్లడించడంతో ఇది మరికాస్త ఆసక్తిగా మారింది.
ప్రకాష్ రాజ్ ప్యానల్ లో సీనియర్లు జయసుధ, సాయికుమార్, శ్రీకాంత్, బ్రహ్మాజీ, నాగినీడు, ఉత్తేజ్, సుధా, సమీర్, బెనర్జీ, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి, ప్రగతి, సనా, అజయ్, రవిప్రకాష్, బండ్ల గణేష్, శివారెడ్డి, ఏడిద శ్రీరామ్, టార్జాన్, అనిత చౌదరి, అనసూయ, రవిప్రకాష్, భూపాల్, ఖయ్యుమ్, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు ఉన్నారు.