Karunakaran : తొలిప్రేమ సినిమాలో చిచ్చుబుడ్డి వెలుగుల్లో హీరోయిన్ ఎంట్రీ.. నిజంగా జరిగిందట.. ఎవరికో తెలుసా?

తొలిప్రేమ సినిమాని నేడు జూన్ 30న రీ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. డైరెక్టర్ కరుణాకరన్ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ గురించి మాట్లాడాడు.

Tholi Prema Movie Heroine entry Scene Back Story told by Director Karunakaran

Tholi Prema :  పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో వచ్చిన సినిమాల్లో తొలిప్రేమ సూపర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. తొలిప్రేమ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించి పవన్ కళ్యాణ్ కి స్టార్ హీరో హోదాని తెచ్చింది. ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేశారు.

తొలిప్రేమ సినిమాని నేడు జూన్ 30న రీ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. డైరెక్టర్ కరుణాకరన్ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ గురించి మాట్లాడాడు. తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. దీపావళి ముందు రోజు చీకట్లో పవన్ రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే హీరోయిన్ కొంతమంది పిల్లలతో కార్ లో వచ్చి రోడ్ మీద చిచ్చుబుడ్డి వెలిగించి హ్యాపీగా ఎగురుతుంటే హీరోయిన్ ని చూపిస్తాడు. ఇప్పటికి తెలుగు సినిమా హీరోయిన్స్ బెస్ట్ ఎంట్రీలలో ఇదొకటిగా ఉండిపోయింది. ఈ ఎంట్రీ సీన్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా ఈ ఎంట్రీ సేన్ గురించి మాట్లాడుతూ అది నిజంగా తన లైఫ్ లో జరిగిందని చెప్పాడు డైరెక్టర్. కరుణాకరన్ మాట్లాడుతూ.. నా సినిమాల్లో చాలా సీన్లు రియల్ లైఫ్ నుంచి తీసుకున్నావ్ పెడతాను. తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ సీన్ కూడా నా నిజ జీవితం నుంచే తీసుకున్నాను. ఒకసారి దీపావళి పండగకు నేను చెన్నై నుంచి మా ఊరు వెళ్తుంటే రోడ్డు మీద ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అటు వైపు తిరిగి చూస్తే చిచ్చుబుడ్డి వెలుగుల్లో ఆ అమ్మాయి కనపడింది, ఆ తర్వాత అంతా చీకటైపోయింది. ఆ సీన్ నా మైండ్ లో బలంగా ఉండిపోయింది. తొలిప్రేమ సినిమా తీసేటప్పుడు ఆ సీన్ ని పేపర్ మీద పెట్టాను. ఆ సీన్ కి కెమెరామెన్ చోటా కె నాయుడు మంచి లైటింగ్ ఇచ్చి చాలా బాగా వచ్చేలా చేశారు అని తెలిపాడు.

Klin Kaara Konidela : రామ్ చరణ్ కూతురి పేరు ‘క్లిం కార కొణిదెల’ (KKK) ఎక్కడ్నుంచి తీసుకున్నారో తెలుసా?

అలాగే డార్లింగ్ లో కాజల్ ఎంట్రీ సీన్ కూడా తన రియల్ లైఫ్ లోదే అని తెలిపాడు. ఒకసారి రోడ్డు మీద స్కూల్ పాప ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ కి ఏంజెల్ లా తయారయి వెళ్తుంది. దాని నుంచే హీరోయిన్ ఎంట్రీ రాసుకున్నాను అని తెలిపారు. కరుణాకరన్ సినిమాల్లో హీరోయిన్స్ ఎంట్రీలు బాగుంటాయి అని తెలిసిందే. వాటి వెనుక ఇలా రియల్ లైఫ్ సీన్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు