Salman Khan : ఏకంగా సల్మాన్ ఖాన్ బామ్మర్దికే ధమ్కీ ఇచ్చిన గ్యాంగ్.. భయం గుప్పిట్లో బాలీవుడ్..
తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ బామ్మర్దిని బెదిరించారు. (Salman Khan)
- Saketh U
- Published On : February 12, 2026 / 08:58 AM IST
Salman Khan
Salman Khan : గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ బాలీవుడ్ ని బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ని చంపుతామని పలుమార్లు ఈ గ్యాంగ్ ప్రకటించడంతో సల్మాన్ ఖాన్ భారీ భద్రతతో బయటకు అడుగుపెడుతున్నారు. రెండు రోజుల క్రితమే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.(Salman Khan)
ఇప్పటికే రణవీర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రణవీర్ ఫ్యామిలీకి భద్రతని ఏర్పాటు చేసారు. తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ బామ్మర్దిని బెదిరించారు. సల్మాన్ ఖాన్ చెల్లి అర్పిత ఖాన్ భర్త ఆయుష్ శర్మ కి బెదిరింపులతో కూడిన ఓ మెయిల్ వచ్చింది. దీంతో ఈ మెయిల్ ని పోలీసులకు చూపించి ఫిర్యాదు చేసారు ఆయుష్ శర్మ.
Also Read : Sree Vishnu : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. శ్రీవిష్ణు కష్టం ఎవరికీ రాకూడదు.. పాపం..
ఈ మెయిల్ కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. రణవీర్ కి వాట్సాప్ లో బెదిరిస్తే ఆయుష్ శర్మని మెయిల్ ద్వారా బెదిరించారు. ఎవరు ఎక్కడ్నించి పంపారు అని కనిపెట్టలేకుండా VPN వాడి పంపించినట్టు సమాచారం. పోలీసులు ఈ రెండిటిపై విచారణ జరుపుతున్నారు.
మొన్న సల్మాన్, ఇప్పుడు సల్మాన్ ఖాన్ బామ్మర్ది, మధ్యలో రణవీర్.. ఇలా వరుసగా బెదిరింపులు వస్తుండటంతో బాలీవుడ్ నటులు భయపడుతున్నారు.
