Anupama Parameswaran : ఆ జంతువుని బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటున్న అనుపమ..

ఆ జంతువుని నాకు బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటూ అనుపమ వైరల్ పోస్టు.

Anupama Parameswaran : ఆ జంతువుని బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటున్న అనుపమ..

Tillu Square Actress Anupama Parameswaran viral post in her instagram story

Anupama Parameswaran : అందాల భామ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఏం పోస్టు చేసినా.. అది వైరల్ కావాల్సిందే. తాజాగా ఈ హీరోయిన్, ఓ జంతువు వీడియోని షేర్ చేస్తూ.. దానిని తనకి గిఫ్ట్ గా ఇస్తే, అనుపమ మీ సొంతం అంటూ పోస్టు వేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అనుపమ అడిగిన ఆ జంతువు ఏంటిది..?

తెలుగులో నీటి ఏనుగుగా చెప్పబడే ‘హిప్పోపొటామస్’ (Hippopotamus) పిల్ల వీడియోని అనుపమ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. “దీనిని నాకు గిఫ్ట్‌గా తీసుకురండి బాయ్స్. నేను మీ సొంతం” అంటూ వైరల్ పోస్ట్ వేశారు. ఇక ఇది చూసిన అబ్బాయిలు.. దాని పై రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆ హిప్పోని బహుమతిగా ఇచ్చి అనుపమని సొంతం చేసుకుందాం పదండి అంటూ సరదా మీమ్స్ క్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి ఫోటోలు లీక్ చేసిన డ్రోన్ పైలట్.. మూవీ రిలీజ్ డేట్‌ని..

Tillu Square Actress Anupama Parameswaran viral post in her instagram story

 

View this post on Instagram

 

A post shared by BSUA💛 (@basic_sense_undadhu_andi)

ఇక అనుపమ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సిద్దు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు కనిపించినంత హాట్ గా ఈ మూవీలో అనుపమ అందాల ఆరబోయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ లో ముద్దు సీన్స్ తో హీటెక్కించారు. మరి సినిమాల్లో ఏ రేంజ్ రొమాన్స్ ఉంటుందో చూడాలి. మార్చ్ 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.