Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి ఫోటోలు లీక్ చేసిన డ్రోన్ పైలట్.. మూవీ రిలీజ్ డేట్‌ని..
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సెట్స్ నుంచి ఫోటోలు లీక్ చేసిన డ్రోన్ పైలట్. ఇక మూవీ మూవీ రిలీజ్ డేట్‌ని..

Drone Pilot leaks photos from Ram Charan Game Changer movie sets
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత మూడేళ్ళుగా చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ మంచి ఆకలితో ఉన్నారు.
ఆ ఆకలిని తీర్చడానికి మూవీ టీం కూడా ఇప్పుడు ముందు అడుగు వేసి శరవేగంగా చిత్రీకరణ జరుపుతూ ముందుకు వెళ్తున్నారు. మొన్నటివరకు షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి లాంగ్ గ్యాప్ తీసుకున్న చిత్రం యూనిట్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
Also read : Operation Valentine : ‘ఆపరేషన్ వాలెంటైన్’ గురించి వరుణ్ తేజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
ఇక ఆ షూటింగ్ సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతూ వస్తున్నాయి. ఇటీవలే హెలికాఫ్టర్ సన్నివేశం చిత్రీకరణ వీడియో లీక్ అయ్యింది. తాజాగా చిత్ర యూనిట్ కి సంబంధించిన వ్యక్తే.. సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ చేశారు. స్టంట్ మాస్టర్స్ అన్బు రివ్ డైరెక్షన్ లో మూవీలోని కీలక యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. వీటిని శంకర్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఇక ఈ సీన్ షూటింగ్ క్రూలో పని చేస్తున్న డ్రోన్ పైలట్.. ఈ చిత్రీకరణకి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసాడు. ఈ పిక్స్ లో శంకర్, అన్బు రివ్ కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన చరణ్ అభిమానులు.. వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. మూవీ టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా కన్ఫార్మ్ చేయనున్నారని తెలుస్తుంది.
View this post on Instagram