Anupama Parameswaran : ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవారు.. అప్పుడు ఎందుకు అలా.. మీడియాతో అనుపమ..

ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవారు అప్పుడు ఎందుకు అలా అడగలేదు.. అంటూ మీడియాని ప్రశ్నించిన అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran : ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవారు.. అప్పుడు ఎందుకు అలా.. మీడియాతో అనుపమ..

Tillu Square star Anupama Parameswaran counter comments to Media

Anupama Parameswaran : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్స్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. టిల్లు గాడు మరోసారి గట్టిగా నవ్వించేసాడు అని చెబుతున్నారు చూసినవారు. కాగా ఈ మూవీ రిలీజ్ కి ముందు అనుపమ పరమేశ్వరన్ చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

ఒక సమయంలో ఆ ప్రశ్నలకు అనుపమ సీరియస్ అయ్యారు కూడా. అసలు విషయం ఎంతంటే, మొన్నటివరకు పక్కింటి అమ్మాయిలా పద్ధతిగా కనిపించిన అనుపమ.. ఈ టిల్లు స్క్వేర్ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ లో కొంచెం అందాల ఆరబోస్తూ హాట్ గా కనిపించింది. ఈ విషయాన్ని వేలెత్తి చూపిస్తూ.. సడన్ గా ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఎందుకు చేసారని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు.

Also read : The Goat Life – Aadu Jeevitham Collections : పృథ్వీరాజ్ సుకుమారన్ ‘గోట్ లైఫ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..!

అయితే అనుపమ మాత్రం.. అది బోల్డ్ క్యారెక్టర్ కాదని, పోస్టర్ లు చూసి పొసపోకండి, సినిమా చూసి మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చారు. కానీ అయినాసరి అనుపమని నిలదీస్తూనే వచ్చారు. నేడు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మూవీ టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో కూడా అనుపమని.. “ఇన్నాళ్లు ఇలాంటి పాత్రని చేయలేదు. ఇప్పుడే ఎందుకు చేసారని” ప్రశ్నించారు.

అనుపమ బదులిస్తూ.. “ఇప్పుడు మీరంతా నవ్వుతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. రిలీజ్ కి ముందు మాత్రం అలా అడగలేదు. మీరు సినిమా చూసి కన్వెన్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నవ్వుతూ అడుగుతున్నారు. రిలీజ్ కి ముందు నేను ఒక మాట చెప్పాను. ఈ రోల్ చేసే వదులుకుంటే నేను మంచి అవకాశం వదులుకున్న దాని అవుతానని. ఈ పాత్రలో నన్ను చూసి కొత్తగా కనిపించానని మీరే అంటున్నారు. అందుకనే నేను ఆ పాత్ర చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.