The Goat Life – Aadu Jeevitham Collections : పృథ్వీరాజ్ సుకుమారన్ ‘గోట్ లైఫ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..!
16 ఏళ్ళ పాటు కష్టపడిన పృథ్విరాజ్ సుకుమారన్ 'గోట్ లైఫ్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?

Prithviraj Sukumaran The Goat Life Aadu Jeevitham Movie collections report
The Goat Life – Aadu Jeevitham Collections : మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ దాదాపు 16 ఏళ్ళ పాటు కష్టపడి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’. బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. విజువల్ రొమాన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజయింది.
తెలుగులో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. వరల్డ్ వైడ్ గా 1724 స్క్రీన్స్ లో రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు 16.7 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఈ మూడు రోజులు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సినిమాకి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. టాక్ బాగుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో ఫస్ట్ డేని మించి కలెక్షన్స్ ని అందుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
Also read : Goodachari 2 : మగధీర లొకేషన్స్ లో గూఢచారి 2 షూటింగ్..
Delighted by the overwhelming response to #TheGoatLife at the box office!
Keep the love pouring!Book your tickets now!
– https://t.co/EbFIoq02UC#TheGoatLifeInCinema #Aadujeevitham pic.twitter.com/3CefxL2Otd— Mythri Movie Makers (@MythriOfficial) March 29, 2024
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి సంపాదించుకోవడం కోసం దుబాయ్ కి వెళ్తాడు. అయితే అక్కడి వాళ్ళు అతడిని ఒక బానిసగా మార్చేసి హింసలు పెడుతుంటారు. దీంతో ఆ బానిస బ్రతుకు నుంచి తప్పించుకోవాలని భావించి.. నడుస్తూ ఇండియా చేరుకోవాలని ఎడారి ప్రయాణం మొదలుపెడతాడు. తాగడానికి కూడా నీరు దొరకని ఎడారి నుంచి ఆ వ్యక్తి ఇండియా ఎలా చేరుకున్నాడు అనేది సినిమా కథ.