ఈ లాక్‌డౌన్ వలన ఇళ్లకే పరిమితమైపోయిన సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్‌లు విసురుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను పాటిస్తున్న ఉపవాసం గురించి తెలియచేస్తూ ఓ పోస్ట్ చేశారు.
తాను గత తొమ్మిది వారాలుగా సాయిబాబా వ్రతంలో ఉన్నానని.. ఇది(ఏప్రిల్ 24) తొమ్మిదవ వారం అని ట్వీట్ చేశారు. ఇవాళ గురువారం కావడంతో ఉపాసన బాబా వ్రతానికి సంబంధించిన వార్తను తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారు. అలాగే బాబాకి నైవేద్యం ఎలా తయారు చేయాలో కూడా వీడియో ద్వారా వివరించారు. ఉపాసన ఉపవాసం విషయం తెలిసి నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.