Samantha : సమంత వెబ్ సిరీస్ ఫస్ట్ పోస్టర్.. బన్నీ కోసం హనీగా మారిన సమంత..

బన్నీ కోసం హనీగా మారిన సమంత. కొత్త వెబ్ సిరీస్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన సమంత.

Samantha : సమంత వెబ్ సిరీస్ ఫస్ట్ పోస్టర్.. బన్నీ కోసం హనీగా మారిన సమంత..

Tollywood Actress Samantha new web series citadel poster released

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ‘ఖుషి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి, తన అనారోగ్య సమస్యకి చికిత్స తీసుకుంటూ వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చే ముందే సమంత.. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. తనకి ‘ఫ్యామిలీ మెన్’ వంటి సిరీస్ తో సూపర్ ఫేమ్ ని తీసుకు వచ్చిన రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సమంత ఈ కొత్త సిరీస్ చేసారు.

ఈ చిత్రానికి గతంలో ‘సిటాడెల్’ అనే టైటిల్ ని పెట్టారు. అమెజాన్ ఒరిజినల్ కంటెంట్ గా వస్తున్న ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటిస్తే.. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇక మేల్ లీడ్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Also read : Surabhi : జస్ట్ మిస్ చనిపోయేదాన్ని.. మేమంతా బతికాం.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

ఇక పోస్టర్ తో టైటిల్ ని ఛేంజ్ చేసినట్లు తెలియజేసారు. సిటాడెల్ టైటిల్ ని అలాగే ఉంచేసి.. ఎడిషనల్ గా ‘హనీ బన్నీ’ అని పెట్టారు. ఈ టైటిల్ డిజైన్ తోనే.. హనీ అంటే సమంత అని, బన్నీ అంటే వరుణ్ ధావన్ అని తెలుస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫా రూపొందిన ఈ సిరీస్.. 90s బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని సమాచారం. మరి ఫామిలీ మెన్ సిరీస్ లో తన యాక్షన్ తో ఆకట్టుకున్న సమంత.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

ఈ స్పై యాక్షన్ సిరీస్ తో ఎలాంటి యాక్షన్ చేయబోతుందో చూడాలి. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో సమంత నటించిన సిరీస్ పై ఇండియన్ ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక సమంత అభిమానులు అయితే.. సామ్ ని మళ్ళీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై చూస్తామా అని ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు.