Surabhi : జస్ట్ మిస్ చనిపోయేదాన్ని.. మేమంతా బతికాం.. హీరోయిన్ పోస్ట్ వైరల్..
తాజాగా సురభి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Actress Surabhi Just Miss Flight Crashing Safely Reached her post goes Viral
Surabhi : బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం.. లాంటి పలు మంచి సినిమాలతో తెలుగులో మెప్పించిన సురభి ప్రస్తుతం తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. సురభి సోషల్ మీడియాలో కూడా తక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
సురభి తన పోస్ట్ లో.. నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను అనిపించింది. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు. కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు. దాంతో మేమంతా బతికాం. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా అంది. జస్ట్ మిస్ చావు నుంచు తప్పించుకొని వచ్చాను. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది అని తెలిపింది.
Also Read : Rajamouli : అతని పేరు మహేష్ బాబు.. రిలీజ్‌కి జపాన్‌కి తీసుకొస్తాను.. నెక్స్ట్ సినిమాపై రాజమౌళి కామెంట్స్..
దీంతో సురభి పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో సురభికి ఏమి కాలేదని తెలుస్తుంది. అయితే సురభి ఎక్కడికి వెళ్తుంది, ఏ ఫ్లైట్ లో, ఎక్కడ ఈ ఘటన జరిగింది అనేది మాత్రం ప్రకటించలేదు.