100 Cr Movies : వరుసగా వంద కోట్లు కొడుతున్న సినిమాలు.. ఇండస్ట్రీకి మంచిదే..

కొన్ని సినిమాలు అయితే వంద కోట్ల జాబితాలో చేరాయి.(100 Cr Movies)

  • Published on- August 19, 2026 / 08:49 AM IST

100 Cr Movies

100 Cr Movies : సంక్రాంతి తర్వాత కాస్త డల్‌ అయిన టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కి దాదాపు 400 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి మంచి బూస్టప్‌ అందించింది రామ్‌ చరణ్‌ పెద్ది సినిమా. ఈ పాన్‌ ఇండియా మూవీ తర్వాత ఆడియెన్స్‌ ముందుకొచ్చిన మరిన్ని సినిమాలు కూడా ఇదే బాటలో సక్సెస్‌ని కంటిన్యూ చేశాయి. ఈ లిస్ట్‌లో చిన్న సినిమాలు హిట్ అవ్వడమే కాక కలెక్షన్స్ కూడా రాబట్టాయి. కొన్ని సినిమాలు అయితే వంద కోట్ల జాబితాలో చేరాయి.

గత శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ సినిమా కేవలం రెండ్రోజుల్లోనే 100కోట్ల మార్క్‌ అందుకుని రికార్డ్ క్రియేట్‌ చేసింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఓవర్సీస్‌లో 1.6 మిలియన్‌ డాలర్స్‌కి పైగా కలెక్ట్‌ చేసింది. ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. పాజిటివ్‌ వైబ్స్‌తో విడుదలైన విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ సినిమా 3 మిలియన్‌కి పైగా బుకింగ్స్‌తో అదరగొడుతోంది.

Also Read : Chiranjeevi : చిరంజీవి హాలీవుడ్ సినిమా ‘అబు’.. 40 కోట్లతో.. అప్పటి విషయాలు బయటపెట్టిన దర్శకులు..

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ సినిమాతో పాటు శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ కంబైన్డ్‌గా ప్రొడ్యూస్‌ చేసిన మరో సినిమా లెనిన్‌ కూడా ఈ ఇయర్‌ వందకోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్‌ హైలైట్‌గా వచ్చిన లెనిన్‌ సినిమా మౌత్‌టాక్‌తో లాంగ్‌ రన్‌లో వందకోట్లు కొల్లగొట్టి అఖిల్‌కి మెమరబుల్ బ్లాక్‌ బాస్టర్‌ సక్సెస్‌ అందించింది లెనిన్‌ సినిమా. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన అఖిల్ కి ఆ లోటు తీర్చేసింది. భారీ సెట్టింగులు, వందల కోట్ల VFX లేకపోయినా కంటెంట్‌లో విషయం ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్‌టగా వస్తాయని లెనిన్‌ సినిమా మరోసారి ప్రూవ్‌ చేసింది.

ఇక లెనిన్‌ సినిమా కంటే ముందుగా ఈ వంద కోట్ల ఫీట్‌ సాధించింది సమంత. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ వుమెన్‌ ఓరియెంటెడ్‌ ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామా స్ట్రాంగ్ మౌత్ టాక్‌తో లాంగ్ రన్‌లో అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటింది. వంద కోట్లు సాధించి ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సమంతకు కూడా మంచి హిట్ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ వందకోట్ల మార్క్‌ని అందుకుని ఈ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాయో చూడాలి. ఇలా వంద కోట్లు వరుస సినిమాలకు రావడం ఇండస్ట్రీకి శుభపరిణామం అంటున్నారు.

Also Read : Irumudi Censor Report : ‘ఇరుముడి’ సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్..