Tollywood : టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి.. డిసెంబర్ లో కళ్యాణ వేడుకలు..
ఇద్దరు తేజ్‌లతో పాటు మరో టాలీవుడ్ జోడీ కూడా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. (Tollywood)
- Saketh U
- Published on- November 8, 2026 / 02:09 PM IST
Tollywood
Tollywood : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్.. ఇక సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పేస్తున్నారు. క్రేజీ సినిమాలతో ఫుల్‌బిజీగా ఉన్న ఈ యంగ్ హీరోలు కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరు తేజ్‌లతో పాటు మరో టాలీవుడ్ జోడీ కూడా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.
సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సినిమాలో మెసేజ్ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ రియల్ లైఫ్‌లో బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేస్తున్నారు. నవంబర్ 5 ఈ గురువారం జరిగిన సాయి దుర్గ తేజ్-కిరణ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో.. మెగా-అల్లు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సందడిగా తేజ్-కిరణ్ నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో సాయి దుర్గ తేజ్-కిరణ్ మ్యారేజ్ గ్రాండ్‌గా జరగనుంది. ఇక త్వరలో సంబరాల ఏటిగట్టు సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్నారు సాయి దుర్గ తేజ్.
Also See : Priyanka Chopra : ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. భర్తతో ఫొటోలు..
మెగా హీరో సాయి దుర్గ తేజ్‌తో పాటు మరో యంగ్ హీరో తేజా సజ్జా సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. నవంబర్‌లో జరిగే ఎంగేజ్‌మెంట్‌కి రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటిలని తేజా సజ్జా ఇన్వైట్ చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరవుతున్నాయి. మ్యారేజ్ విషయానికి వస్తే డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తేజాసజ్జా వివాహ వేడుక కుటుంబ సభ్యులు, క్లోజ్ సన్నిహితుల మధ్య జరగనుంది. ఇక హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. మిరాయ్‌తో మరో పాన్ ఇండియా సక్సెస్ చూసిన తేజా సజ్జా త్వరలో జాంబీరెడ్డి 2తో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
2026 డిసెంబర్‌లో ఈ ఇద్దరు తేజ్‌లతో పాటు.. మరో టాలీవుడ్ క్రేజీ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కేస్తోంది. ఎంఎం కీరవాణి పెద్దకొడుకు సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కలిసి ఏడడుగులు నడవబోతున్నారు. ఇప్పటికే ఈ జంట ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు, క్లోజ్ రిలేటివిస్ సమక్షంలో జరిగిన కాలభైరవ-కావ్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కాలభైరవ టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తున్నారు. ఇలా డిసెంబర్ లో టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి నెలకొంది.
