Tollywood : ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..

ఈ శుక్రవారం థియేటర్ లో సందడి చేయడానికి మూడు సినిమాలు సిద్ధమవుతుంటే, ఓటీటీలో రెండు చిత్రాలు.

Tollywood movies released in theater and ott in december last week

Tollywood : ఈ వీకెండ్ తో ఈ ఇయర్ కూడా ముగియబోతుంది. మరి ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి. ఈ శుక్రవారం థియేటర్ లో సందడి చేయడానికి మూడు సినిమాలు సిద్ధమవుతుంటే, ఓటీటీలో రెండు చిత్రాలు.

థియేటర్‌లో రిలీజ్ కాబోయే సినిమాలు..
#Devil : కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్స్ నటించిన ఈ చిత్రం బ్రిటిష్ టైం పీరియడ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు.

#Bubblegum : టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వారసుడు ‘రోషన్’ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘బబుల్ గమ్’. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేశారు.

#Venky : శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘వెంకీ’. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికి ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా డిసెంబర్ 30న శనివారం రిలీజ్ కాబోతుంది.

Also read : Upasana : చరణ్ విజయం వెనుక నేను కాదు.. నాకు సపోర్ట్‌గా చరణ్.. ఉపాసన కామెంట్స్..

ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు..
#Annapoorani : నయనతార మెయిన్ లీడ్ లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అన్నపూర్ణి’.. ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది.

#Keedaa Cola : టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తరువాత చాలా గ్యాప్ తీసుకోని తెరకెక్కించిన సినిమా ‘కీడా కోలా’. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు