Peddi : టాలీవుడ్ ని కుదిపేస్తున్న ‘పెద్ది’ సమస్య.. చర్చల్లో నిర్మాతలు.. ఇలా అయితే ఎఫెక్ట్ తప్పదు..
థియేటర్ల సమస్య అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాకు లింక్ అవుతుంది. (Peddi)
- Saketh U
- Published on- May 3, 2026 / 04:16 PM IST
Peddi
Peddi : టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ది సినిమా చర్చగా మారింది. థియేటర్ల సమస్య అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాకు లింక్ అవుతుంది. టాలీవుడ్ నిర్మాతల మధ్యే విబేధాలు కూడా వచ్చాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు చర్చల్లో మునిగారు.
గతంలో ఏపీలోని పలు థియేటర్స్ ఎగ్జిబిటర్లు తమకు సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే రిలీజ్ చేయాలని, రెంటల్ విధానం వద్దని లేకపోతే థియేటర్స్ బంద్ చేస్తామని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సమయంలో హడావిడి చేసారు. అప్పట్లో ఇది పెద్ద సమస్యే అయింది. పవన్ సినిమాని టార్గెట్ చేసి కొంతమంది నిర్మాతలే కావాలని చేస్తున్నారు అని టాక్ నడిచింది. ఆ నిర్మాతలపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అప్పటికి ఏదో మాట్లాడి చివరి నిమిషంలో ఎగ్జిబిటర్లను కూల్ చేసారు.
అదే సమస్య తెలంగాణ థియేటర్స్ కి కూడా వచ్చింది. తెలంగాణలోని కొన్ని సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ విధానంలో అయితేనే సినిమాలు రిలీజ్ చేస్తాం పాత రెంటల్ విధానంలో అయితే సినిమాలు రిలీజ్ చేయము అని గట్టిగానే ప్రకటించారు. దీనిపై ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు – డిస్ట్రిబ్యూటర్లు – ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో చెప్పినట్టే మే 1 నుంచే కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సినిమాలు ప్రదర్శించలేదు.
Also See : Raviteja Daughter : రవితేజ కూతురు మోక్షద లేటెస్ట్ ఫొటోలు చూశారా..? హీరోయిన్స్ ని మించి..
అయితే నిర్మాత సునీల్ నారంగ్ కి సంబంధించిన ఏషియన్ సినిమాస్, దిల్ రాజుకు సంబంధించిన SVC సినిమాస్ సింగిల్ స్క్రీన్స్ లో మే 1న రిలీజయిన మైత్రి వాళ్ళ జెట్ లీ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మల్టిప్లెక్స్ లలో కూడా ఈ సినిమాని విడుదల చేయనివ్వలేదు. దీనిపై మైత్రి నిర్మాతలు మండిపడుతూ సింగిల్ స్క్రీన్ వివాదం ఉంటే అక్కడ సినిమా ఆపుకోవాలి కానీ, మల్టిప్లెక్స్ లలో సినిమా ఎందుకు ఆపుతున్నారు, జెట్ లీ సినిమాని తొక్కేస్తున్నారు అని అధికారికంగా నోటిస్ రిలీజ్ చేసారు. జెట్ లీ నిర్మాత చెర్రీ కూడా మీడియా ముందు ఫైర్ అయ్యారు.
Peddi
దీంతో నిర్మాతలే థియేటర్స్ సమస్య గురించి ఇలా బహిరంగంగా ఫైర్ అవుతుండటంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ సమస్యకు సంబంధించి మరోసారి ఫిలిం ఛాంబర్ లో నిర్మతలు – ఎగ్జిబిటర్లు – డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు మే 8న జరగనున్నాయి. అప్పటికి ఈ సమస్య పరిష్కారం కాకపోతే థియేటర్స్ బంద్ తప్పదు. తెలంగాణలోని కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో సినిమాలు రిలీజ్ అవ్వవు. నిర్మాతలు తలుచుకుంటే జెట్ లీని ఆపినట్టు తర్వాత వచ్చే సినిమాలను కూడా మల్టీప్లెక్స్ లలో ఆపొచ్చు.
అయితే త్వరలోనే జూన్ 4న పెద్ది సినిమా రిలీజ్ ఉంది. పెద్ది అసలైతే ఏప్రిల్ 30 నే రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆల్రెడీ అనధికార థియేటర్స్ బంద్ జరుగుతుంది. ఇప్పుడు కనక పెద్ది రిలీజ్ అయి ఉంటే సినిమాపై భారీ ఎఫెక్ట్ పాడేది. ఇప్పుడు జూన్ 4 వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే పెద్ది సినిమాపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడే థియేటర్స్ కి భారీ ఆదాయం, కలెక్షన్స్ వస్తాయి. థియేటర్స్ లేకపోతే పెద్ది రిలీజ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలే మల్టీప్లెక్స్ లలో కూడా రిలీజ్ చెయ్యనివ్వట్లేదు కాబట్టి పెద్దిపై నైజాంలో మరింత ఎఫెక్ట్ పడనుంది.
గతంలో హరిహర వీరమల్లుని కావాలని టార్గెట్ చేసారని పలువురు నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పెద్ది ని కూడా టార్గెట్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు అంతా పెద్ది సినిమా కోసం అయినా ఈ థియేటర్స్ సమస్యని పరిష్కరించాలని చర్చించుకుంటున్నారు. నేడు గోపీచంద్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి ఎన్నడూ లేని విధంగా చాలా మంది నిర్మాతలు హాజరయ్యారు. అక్కడ వీరు ఈ థియేటర్స్ సమస్యే చర్చించుకున్నట్టు తెలుస్తుంది. సగం థియేటర్స్ పలువురు నిర్మాతల ఆధీనంలోనే ఉన్నాయి. అందుకే నిర్మాతల్లోనే విభేదాలు వస్తుండటంతో పెద్ది రిలీజ్, థియేటర్స్ పర్సంటేజ్ విధానం ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల్లో చర్చగా మారింది.
మరి అన్ని అడ్డంకులు తొలిగి పెద్ది సినిమా జూన్ 4 కి అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. అసలే సమ్మర్ లో ఒక్క పెద్ద సినిమా కూడా లేక థియేటర్స్ ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఇప్పుడు పెద్దిని కూడా ఆపినా, కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయకపోయినా అటు థియేటర్స్ కి, ఇటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, సినీ పరిశ్రమకు అందరికి నష్టం తప్పదు.
