Arjun Raju : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత..
నేడు టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కన్నుమూశారు. (Arjun Raju)
- Saketh U
- Published On : March 13, 2026 / 06:35 PM IST
Arjun Raju
Arjun Raju : నేడు టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత M అర్జున్ రాజు నేడు మధ్యాహ్నం తన స్వగృహంలో మరణించారు. వయోభారం, పలు ఆరోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు.
ఎన్టీఆర్ తో వేటగాడు, చిరంజీవితో జేబు దొంగ, హిందీలో జానీ దోస్త్, ఫార్జ్ ఆర్ కానూన్.. లాంటి పలు సినిమాలను రోజా ఆర్ట్స్ బ్యానర్ పై అర్జున్ రాజు నిర్మించారు. రేపు శనివారం 14వ తేదీన ఉదయం ఆయన అంత్యక్రియలు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాజుకు నివాళులు అర్పిస్తున్నారు.
Also See : Allu Cinemas Inside Photos : కొత్తగా ఓపెన్ అయిన అల్లు సినిమాస్.. లోపల ఎంత బాగుందో చూడండి.. ఫొటోలు..
