సీనియర్ హీరోలకి జూనియర్ హీరోయిన్స్ కూడా దొరకడం లేదే!

షూటింగ్స్ స్టార్ అయినా టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరక్క తిప్పలు పడుతున్న దర్శక నిర్మాతలు..

  • Publish Date - February 7, 2020 / 08:16 AM IST

షూటింగ్స్ స్టార్ అయినా టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరక్క తిప్పలు పడుతున్న దర్శక నిర్మాతలు..

మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనమే కాంట్రాక్ట్ తీసుకున్నట్టు.. నా కష్టం పగవాడికూడా రాకూడదు బాబోయ్.. అనుకుంటాం. ఇప్పుడు మన టాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం నా కష్టం ఏ హీరోకీ రాకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటారా.. మన హీరోలకి హీరోయిన్లు దొరకడం లేదు మరి.. రూ.50 కోట్లు పారితోషికంగా అందుకునే హీరోలకు కూడా హీరోయిన్ దొరకకపోవడం విడ్డూరం కాకపోతే మరేంటి?

చిరు సరసన నాయిక ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటివరకు కథానాయిక ఫైనల్ కాలేదని సమాచారం.

బాలయ్యకు బ్యూటీస్ దొరికారా..
నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా కూడా రెగ్యూలర్ షూటిటంగ్ స్టార్ట్ కాబోతోంది. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య.. బోయపాటితో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు కూడా హీరోయిన్లు దొరకడం లేదు. ఒక వైపు శ్రేయా.. నయనతారను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా.. వారు ఒప్పుకోలేదు అన్న మాట వినిపిస్తుంది. ఇంకో వైపు రకుల్ ప్రీత్ సింగ్, కేథెరిన్‌‌లను కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు బలకృష్ణకు జోడీగా కనిపించబోతున్నారో చూడాలి. 

‘నారప్ప’లో వెంకటేశ్ జోడీగా అమలా పాల్, ప్రియమణి పేర్లు..
విక్టరీ వెంకటేష్ తమిళ్ సినిమా ‘అసురన్’ రీమేక్ బీజీలో ఉన్నాడు. ‘నారప్ప’ టైటిల్‌తో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో రూపొందుతోంది ఈ మూవీ. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తియింది.. తమిళ నాడులో సెంకడ్ షెడ్యూల్ స్టార్ట్ అయినా.. ఇంకా హీరోయిన్‌పై క్లారిటీ రాలేదు. ‘అసురన్’ లో దనుష్‌కి జంటగా మళయాళ బ్యూటీ మంజూ వారియర్ నటించింది. తెలుగులో వెంకటేష్‌కు జోడీగా ప్రియమణితో పాటు అమలా పాల్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అఫీషియల్‌గా మాత్రం ఎనౌన్స్ మెంట్ రాలేదు.

పవన్ – క్రిష్ సినిమాలో కియారా అద్వాని కోసం డైరెక్టర్ ప్రయత్నాలు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. కమ్ బ్యాక్ మూవీగా ‘పింక్’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, నివేధా థామస్ నటిస్తారన్న న్యూస్ వినిపిస్తుంది. అఫీషియల్‌గా మాత్రం కన్‌ఫామ్ కాలేదు.

ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో మరో సినిమా స్టార్ట్ చేశాడు పవన్. ఈ మూవీకి మొదట ప్రగ్యా జైస్వాల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు కియారాను తీసుకోవాలని అనుకుంటున్నారు. క్రిష్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఒప్పుకుంటే ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరి మన టాలీవుడ్ నాయకులకు ఈ కథానాయికల కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి..