Toxic : ఇదేం చోద్యం.. అలా ప్రచారం చేయోద్దట.. కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకున్న టాక్సిక్ నిర్మాతలు..

తాజాగా టాక్సిక్ సినిమా నిర్మాతలు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయకుండా కోర్టు నోటీసులు తెచ్చుకున్నారు. (Toxic)

  • Published on- August 27, 2026 / 11:10 AM IST

Toxic

Toxic : యశ్ హీరోగా ఎన్నో అంచనాలతో నిన్న రిలీజయిన టాక్సిక్ సినిమా మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు ఏ ఎమోషన్ పండకుండా కేవలం యాక్షన్, రొమాన్స్ సీన్స్ తోటి భారీ సెట్టింగ్స్ వేసి నడిపించారు ఈ సినిమాని. అని భాషల్లో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది.

దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పంచుకుంటున్నారు. సినిమా ముందు దీనికి ఓ రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో పలువురు సినిమా చూసి టాక్సిక్ ని ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Karthika Deepam : మొత్తానికి ‘జ్యోత్స్న – సూరజ్’లకు పెళ్లి అయిపోయింది.. ‘కార్తీక దీపం’ కొత్త జంట.. ఫొటోలు వైరల్..

అయితే తాజాగా టాక్సిక్ సినిమా నిర్మాతలు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయకుండా కోర్టు నోటీసులు తెచ్చుకున్నారు. టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు.. సినిమాకు వ్యతిరేకంగా, తప్పుడు ప్రచారం, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేయడం, సినిమాని కించపరిచే అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. లాంటివి చేయకూడదు అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. దీంతో టాక్సిక్ నిర్మాణ సంస్థపై విమర్శలు వస్తున్నాయి.