Trisha – Brinda : త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్ ‘బృంద’ టీజర్ రిలీజ్.. మంచితో పోరాడాలి..

ఇన్నాళ్లు సినిమాల్లో అలరించిన త్రిష ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.

Trisha Brinda Web Series Teaser Released

Trisha – Brinda Teaser : దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న త్రిష ఇప్పటికి కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందాన్ని మైంటైన్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి వరుస సినిమాలతో స్టార్ హీరోలందరి సరసన చేస్తుంది. ఇటీవల స్టార్ నటీనటులు అంతా వెబ్ సిరీస్ లలో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాల్లో అలరించిన త్రిష ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.

త్రిష మెయిన్ లీడ్ లో ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘బృంద’. కొల్లా ఆశిష్ నిర్మాణంలో సూర్య మనోజ్ వంగల దర్శకత్వంలో బృంద సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేసారు. కథేంటి అర్ధం కాకుండా టీజర్ ని ఆసక్తిగా కట్ చేసారు. బృంద సిరీస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో డైలాగ్స్ అయితే బాగున్నాయి.

Also Read : Bharateeyudu 2 : సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకి.. ఆ పని మొదలుపెట్టిన ‘భారతీయుడు 2’ టీమ్..

ఇక త్రిష బృంద సిరీస్ సోని లివ్ ఓటీటీలో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవ్వనుంది. దీంతో త్రిష అభిమానులు ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలో మెప్పించిన త్రిష తన ఫస్ట్ వెబ్ సిరీస్ తో ఎలా మెప్పిస్తుందో చూడాలి. బృంద టీజర్ మీరు కూడా చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు